Lakshmi narayana yogam: మరి కొన్ని రోజుల్లో మేష రాశిలో గ్రహాల అరుదైన కలయిక జరగబోతుంది. ఫలితంగా ఏడాది తర్వాత శుభ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల దశ తిరగబోతుంది.

గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో మేష రాశిలో సంచరించబోతున్నాడు. తెలివితేటలు, తర్కం, జ్ఞానం వంటి వాటికి కారకుడు బుధుడు. అటు మరో రెండు రోజుల్లో సంపద, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు కూడా తన కదలికను మార్చుకొని మేష రాశిలో ప్రవేశం చేస్తాడు. మేష రాశిలో శుక్రుడు మే 19 వరకు ఉంటాడు. మే నెలలో బుధుడు మేష రాశిలోకి ప్రవేశించిన సుకరుడితో సంయోగం చెందన వెంటనే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన వాడని నమ్ముతారు. బుధుడి అనుగ్రహంతో తెలివితేటలు, జ్ఞానం మెరుగుపడతాయి. ఈ సమయంలో తెలివిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి. మేష రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక ద్వారా వచ్చే లక్ష్మీనారాయణ యోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంపదతో తులతూగనున్నారు. సుమారు ఏడాది తర్వాత బుధ, శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశిలోనే బుధ ,శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది. ఫలితంగా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంటి వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదంగా ఉంటుంది. లవర్ తో డేటింగ్ కూడా వెళ్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు పొందుతారు. కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. బుద్ధిపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చి పెడతాయి.

మిథున రాశి

బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల వచ్చే లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పని ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి ఒప్పందం మీ ముందుకు వస్తుంది. ఇది లాభదాయకంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లాలనుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది. ఆధ్యాత్మిక భావనతో మీ మనసు పొంగిపోతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది.

ధనుస్సు రాశి

లక్ష్మీనారాయణ యోగం ధనుస్సు రాశి వారికి ధనాన్ని తీసుకురాబోతుంది. ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. శృంగారం, ఆకర్షణ, ప్రేమతో వైవాహిక జీవితం నిండిపోతుంది. షార్ట్ ట్రిప్ కి కూడా వెళ్లే అవకాశం ఉంది. కెరీర్ లో కొత్త పనులు దొరుకుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఐశ్వర్యం రెట్టింపుకాబోతుంది. వృత్తిపరంగా, ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ నైపుణ్యాలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు.