WhatsApp latest features : దిగ్గజ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​.. ఒక కొత్త ఫీచర్​ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్​ అమల్లోకి వస్తే.. ఇక ఇంటర్నెట్​ లేకుండానే.. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్​ వంటి మీడియా ఫైల్స్​ని షేర్​ చేసుకోవచ్చని సమాచారం. ఈ ఫీచర్​కి సంబంధించి, ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇంటర్నెట్​ లేకుండానే ఫైల్స్​ షేరు చేసుకోవచ్చు..!

వాబీటాఇన్ఫో ప్రకారం.. ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​.. షేరిట్​ వంటి బ్లూటూత్​ ఎనేబుల్డ్​ యాప్స్​లాగానే పనిచేస్తుంది. అంటే.. వినియోగదారులు.. తమ ఫోన్​లోని బ్లూటూత్​ ఆన్​ చేయాలి. ఫలితంగా.. ఆఫ్​లైన్​ షేరింగ్​ ప్రాసెస్​ మొదలవుతుంది. బ్లూటూత్​లో మన సమీపంలోని డివైజ్​లను ట్రేస్​ చేసి, ఫైల్స్​ని షేర్​ చేసే వెసులుబాటు ఉంటుంది కది. వాట్సాప్​ కొత్త ఫీచర్​ కూడా ఇలాగే పనిచేస్తుంది.

ఇలా సమీపంలోని డివైజ్​లను ట్రేస్​ చేయాలంటే.. స్మార్ట్​ఫోన్​లోని సిస్టెమ్​ ఫైల్స్​, ఫొటో గ్యాలరీకి సంబంధించిన పర్మీషన్స్​ వాట్సాప్​కి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో.. చుట్టుపక్కన ఏవైనా డివైజ్​లు ఉన్నాయా? అని చూసేందుకు.. లొకేషన్​ పర్మీషన్​ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

WhatsApp photo sharing without internet : మరి ఇంటర్నెట్​ లేకుండా చేసే ఫైల్స్​ ట్రాన్స్​ఫర్​ సేఫ్​గా ఉంటుందా? అంటే.. కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఇలా షేర్​ చేసే ఫైల్స్​కి కూడా ఎన్​క్రిప్షన్స్​ ఉంటాయని, డేటా సేఫ్​గా ఉంటుందని సమాచారం. ఎవరూ టాంపర్​ చేయలేరని తెలుస్తోంది.

ఇలా ఇంటర్నెట్​ లేకుండా ఫొటోలు, మీడియా ఫైల్స్​ షేర్​ చేసుకునే వెసులుబాటును కల్పించే ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​.. ఎప్పుడు లాంచ్​ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ప్రస్తుతం ఈ ఫఈచర్​ బీటా టెస్టింగ్​ దశలో ఉంది. ఫలితంగా.. త్వరలోనే ఇది యూజర్స్​కు కూడా అందుబాటులోకి రావొచ్చని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

WhatsApp news feature : ఇంటర్నెట్​తో పాటు వాట్సాప్​ కూడా ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్​ఫోన్​ ఉన్న వారిలో దాదాపు ప్రతి ఒక్కరు ఈ మెటా ఆధారిత సోషల్​ మీడియాని వాడుతుంటారు. నిత్యం, ఫొటోలు, మీడియా ఫైల్స్​ని షేర్​ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంటర్నెట్​ లేకుండా కూడా షేర్​ చేసుకోవచ్చంటే.. ఇది వాట్సాప్​ కొత్త ఫీచర్​ కచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.