Kia Carens safety rating : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​కు.. ఇండియాలో ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటి కియా క్యారెన్స్​. ఈ ఎంపీవీకి సంబంధించిన గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

కియా క్యారెన్స్​ గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​..

గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ చైల్డ్​ ప్రొటెక్షన్​ విభాగంలో కియా క్యారెన్స్​కి 5 స్టార్​ రేటింగ్​ లభించింది. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 3 స్టార్​ రేటింగ్​ వచ్చింది. అయితే.. కియా క్యారెన్స్​ని రెండుసార్లు టెస్ట్​ చేయడం జరిగింది. మొదటిసారి టెస్ట్​ చేసినప్పుడు.. అడల్ట్​ ప్రొటెక్షన్​లో ఈ ఎంపీవీకి 0 రేటింగ్​ రావడం ఇందుకు కారణం. 2023 మే నుంచి 2023 డిసెంబర్​ వరకు తయారన యూనిట్స్​కి 0 స్టార్​ రేటింగ్​ వచ్చింది. ఆ తర్వాత తయారైన యూనిట్​లకు 3 స్టార్​ రేటింగ్​ వచ్చింది. క్యారెన్స్​లో కాస్త సేఫ్టీ ఫీచర్స్​ని జోడించడం ఇందుకు కారణం.

Kia Carens safety rating 2024 : గ్లోబల్​ ఎన్​సీపీ క్రాష్​ టెస్ట్​కు వెళ్లిన కియా క్యారెన్స్​ ఎంపీవీలో ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​, బెల్ట్​- ప్రిటెషనర్స్​, బెల్ట్​ లోడ్​ లిమిటర్స్​, సైడ్​ హెడ్​ కర్టైన ఎయిర్​బ్యాగ్స్​, ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ చైల్డ్​ సీట్​ మౌంట్స్​ వంటివి ఉన్నాయి.

కియా క్యారెన్స్​ గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ ప్రకారం.. డ్రైవర్​, ప్యాసింజర్​ హెడ్​కి సంబంధించిన ఫ్రెంటల్​ ఇంపాక్ట్​ బాగానే ఉంది. కానీ డ్రైవర్​ మెడకు అందిన ప్రొటెక్షన్​ సరిపోలేదు. ప్యాసింజర్​ మెడకు సరైన రక్షణ లభించింది. డ్రైవర్​ ఛాతి రక్షణ కూడా సంతృప్తికరంగానే ఉంది. ప్యాసింజర్​ ఛాతి సంరక్షణ కూడా బాగానే ఉంది. కానీ డ్రైవర్​, ప్యాసింజర్​ మోకాళ్ల రక్షణ అంతంతమాత్రంగానే ఉంది. బాడీషెల్​ అన్​స్టేబుల్​గా ఉంది. మరింత లోడ్​ పడితే భరించడం కష్టమైంది.

సైడ్​ ఇంపాక్ట్ విషయానికొస్తే తల, ఛాతీ, కడుపు లభించిన రక్షణ బాగానే ఉంది. సైడ్​ పోల్​ ఇంపాక్ట్​ టెస్ట్​ జరగలేదు. అన్ని వేరియంట్స్​లో 3 పాయింట్​ సీట్​ బెల్ట్స్​ని స్టాండర్డ్​గా అందిస్తోంది కియా మోటార్స్​.