Peddapally Bridge Collapse: పెనుగాలుల ధాటికి నిర్మాణంలో bridge బ్రిడ్జి కుప్పకూలింది Collapse. బలమైన గాలుతో Winds నిర్మాణంలో బ్రిడ్జి కూలిపోవడం అందరని హడలెత్తించింది. ముత్తారం మండలం ఓడేడు వద్ద మానేరు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి రాత్రిపూట కూలడంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది.

ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గత వర్షా కాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి బీమ్ లు కొట్టుకు పోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. తాజాగా అర్ధరాత్రి గాలిదుమారానికి బ్రిడ్జి పై ఉన్న మూడు సిమెంట్ గడ్డర్స్ క్రింద పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలులకే బ్రిడ్జి కూలిపోలవడం ఏమిటనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రెండు జిల్లాల మద్య వారిధి

పెద్దపల్లి – జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మద్య మానేర్ నదిపై రాకపోకలు సాగించేందుకు ముత్తారం మండలం ఓడేడు, టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి గ్రామాల మద్య మానేర్ నదిపై 2016 లో బిఆర్ఎస్ ప్రభుత్వం బిడ్జి మంజూరు చేసింది.

అదే సంవత్సరం 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. 8 ఏళ్ళుగా పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. నిర్లక్ష్యంగా పనుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టి పక్కన పెట్టింది.

నాడు అక్కడ.. నేడు ఇక్కడ…

బ్రిడ్జి నిర్మాణ పనుల కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న శ్రీ సాయి కన్స్ట్రక్షన్ తార్నక అభాసు పాలవుతుంది. ఇదే కాంట్రాక్టర్ గతంలో వేములవాడ వద్ద మూల వాగుపై చేపట్టిన బ్రిడ్జి అప్పట్లో కూలిపోయింది. అప్పట్లో ప్రభుత్వం విచారణ జరిపి కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టారు.

ఆ సమయంలోనే ఓడేడు బ్రిడ్జి నిర్మాణ పనులు 49 కోట్లకు దక్కించుకున్న శ్రీ సాయి కన్ స్ట్రక్షన్ పనులు నాణ్యత లోపంతో చేపట్టడంతో ప్రభుత్వం అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది.‌ కాంట్రాక్టు రద్దుచేసి సుమారు 60 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు తిరిగి చేపట్టారు. ఇలాంటి సమయంలో సోమవారం రాత్రి గాలిదుమారానికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

నాసిరకం నిర్మాణ పనులతో కూలిందా, గాలుల ధాటికి కూలిందా అనేది తేలాల్సి ఉంంది. 2016లో గర్మిళ్ల పల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చిన్న గాలి వానకే గడ్డర్లు కూలిపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు కలిపేందుకు నిర్మిస్తోన్న వారధి ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతుండగా, తాజా కుప్పకూలిపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

కాంట్రాక్టుల్లో కమిషన్లపై ఉండే శ్రద్ధ నిర్మాణ పనులపై పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి-జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రజలు వంతెన నిర్మాణం కోసం ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వంతెకన కూలిపోవడంతో ఇప్పుడు దాని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా)