IPL 2024 points table today : ఐపీఎల్​ 2024లో పంజాబ్​ కింగ్స్​పై నెయిల్​ బైటింగ్​ థ్రిలర్​లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్​. జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ రాణించడంతో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్​పై విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్​లో విజయంతో.. ముంబై ఇండియన్స్ రెండు కీలక పాయింట్లు సాధించి.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పెరిగింది.