Home Business కియా కంపెనీని నిలబెడుతున్న కారు.. ఇప్పుడు కొన్నొళ్లకు ఏకంగా రూ.60000 ఆదా చేసుకునే ఛాన్స్

కియా కంపెనీని నిలబెడుతున్న కారు.. ఇప్పుడు కొన్నొళ్లకు ఏకంగా రూ.60000 ఆదా చేసుకునే ఛాన్స్

3
0

కియా కంపెనీని నిలబెడుతున్న కారు.. ఇప్పుడు కొన్నొళ్లకు ఏకంగా రూ.60000 ఆదా చేసుకునే ఛాన్స్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కియా ఇండియా, జూలై నెలలో తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ జూలై నెల మొత్తం సోనెట్ కార్లపై కస్టమర్లకు రూ.60,000 వరకు అద్భుతమైన బెనిఫిట్స్ లభించనున్నాయి. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సరికొత్త మోడల్ ఇయర్ 2026 కార్లపై మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే, గ్లోబల్ మార్కెట్లో పెరిగిన ముడిసరుకు, రవాణా ఖర్చుల (లాజిస్టిక్స్) భారం కారణంగా కియా సంస్థ గత నెలలోనే ఈ కారు ధరలను స్వల్పంగా పెంచింది. కంపెనీ ఈ అదనపు భారాన్ని పూర్తిగా కస్టమర్లపై వేయకుండా, కొంత భాగాన్ని తానే భరించి మిగిలిన మొత్తాన్ని వేరియంట్లను బట్టి సవరించింది. ప్రస్తుతం కియా సోనెట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.33 లక్షల నుంచి టాప్ మోడల్ ధర రూ. 14.09 లక్షల మధ్య ఉంది.

Kia Sonet July 2026 Deal Get Up to Rs 60 000 Off on This Top SUV With 6 Airbags ADAS

పెట్రోల్ వేరియంట్ల కొత్త ధరలు ఇవే
ధరల పెంపు తర్వాత కియా సోనెట్ 1.2-లీటర్ నార్మల్ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్లలో హెచ్‌టీఈ (HTE) ధర రూ.1,600 పెరిగి రూ.7,33,500కి చేరింది. అలాగే హెచ్‌టీఈ(ఓ) ధర రూ. 7,76,500 కాగా, హెచ్‌టీకే(ఓ) ధర రూ. 8,77,600 గా మారింది. ఇక హెచ్‌టీకే+ వేరియంట్ ధర రూ. 9,14,600, హెచ్‌టీకే+(ఓ) వేరియంట్ ధర రూ. 9,64,600 కి పెరిగాయి.

టర్బో పెట్రోల్ విభాగంలో 1.0-లీటర్ ఏసీఎమ్‌టీ మోడళ్లలో హెచ్‌టీకే(ఓ) ధర రూ.9,16,600 కాగా, హెచ్‌టీకే+(ఓ) ధర రూ.10,11,600 గా నిర్ణయించారు. ఇదే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ (DCT) వేరియంట్లలో హెచ్‌టీకే(ఓ) ధర రూ.9,96,600కి, హెచ్‌టీకే+(ఓ) ధర రూ.10,91,600కి, హెచ్‌టీఎక్స్ ధర రూ.11,66,600కి పెరిగాయి. వీటితో పాటు లగ్జరీ మోడల్స్ అయిన జిటిఎక్స్+ ధర రూ.13,57,600, ఎక్స్-లైన్ ధర రూ.13,71,600 గా స్థిరపడ్డాయి. ఈ ఆటోమేటిక్ వేరియంట్లన్నింటిపై దాదాపు రూ.1,700 వరకు ధర పెరిగింది.

Kia Sonet July 2026 Deal Get Up to Rs 60 000 Off on This Top SUV With 6 Airbags ADAS

డీజిల్ వేరియంట్లలోనూ మార్పులు
డీజిల్ కార్లను ఇష్టపడే వారి కోసం కియా సోనెట్ 1.5-లీటర్ టర్బో డీజిల్ మ్యాన్యువల్ వేరియంట్ ధరలను కూడా సవరించింది. ఇందులో బేస్ మోడల్ హెచ్‌టీఈ(ఓ) ధర రూ.1,600 పెరిగి రూ.9,01,500 కి చేరుకోగా, హెచ్‌టీకే+ ధర రూ.10,37,600కి, హెచ్‌టీకే+(ఓ) ధర రూ.10,87,600కి, హెచ్‌టీఎక్స్ ధర రూ.11,32,600కి పెరిగాయి.

అదేవిధంగా 1.5-లీటర్ టర్బో డీజిల్ ఆటోమేటిక్ (TC) వేరియంట్లలో హెచ్‌టీఈ(ఓ) ధర రూ9,81,500గా మారింది. అలాగే హెచ్‌టీకే(ఓ) ధర రూ.10,81,600 కాగా, హెచ్‌టీకే+ ధర రూ.11,17,600కి, హెచ్‌టీకే+(ఓ) ధర రూ.11,67,600కి చేరాయి. ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్లయిన హెచ్‌టీఎక్స్ ధర రూ.12,11,600, అత్యంత ఖరీదైన జిటిఎక్స్+ ధర రూ.14,08,600గా కంపెనీ మార్చింది.

Kia Sonet July 2026 Deal Get Up to Rs 60 000 Off on This Top SUV With 6 Airbags ADAS

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు
కియా సోనెట్ కారు మొత్తం మూడు రకాల పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 120 బ్రేక్ హార్స్‌పవర్ (bhp), 172 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్‌ను అందిస్తుంది. రెండవది 1.2 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజన్, ఇది 83 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 116 bhp పవర్, 250 Nm టాప్ టార్క్‌ను ఇస్తుంది.

సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారులో అధునాతన లెవెల్-1 ఏడీఏఎస్ (ADAS) సిస్టమ్ ఉంది. దీనితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు 360-డిగ్రీల కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ వంటి గట్టి పోటీదారులకు గట్టి పోటీని ఇస్తోంది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here