HomeBusinessసస్పెండ్ అయినా సత్కారాల ..!

సస్పెండ్ అయినా సత్కారాల ..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • సస్పెండ్ అయిన నేతకు గజమాల స్వాగతం
  • తాండూరులో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విమర్శల
  • వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్

జనవాహిని ప్రతినిధి తాండూరు; డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ చర్యలను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలకడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అధిష్టానం ఒకవైపు చర్యలని చెబుతుంటే, క్షేత్రస్థాయిలోని నేతలు మాత్రం బ్రహ్మరథం పట్టడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ విమర్శలు గుప్పించారు.
ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ
ఈ ఘటన ద్వారా బీఆర్‌ఎస్ క్రమశిక్షణారాహిత్యం మరోసారి రుజువైందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ అధిష్టానం ఒకవైపు రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు గుప్పిస్తుంటే, క్షేత్రస్థాయి నాయకులు మాత్రం గజమాలలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. క్రమశిక్షణ అనేది బీఆర్‌ఎస్ డిక్షనరీలోనే లేదుఅని ఆరోపించారు.
పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి సొంత పార్టీ నాయకులే సత్కారాలు చేస్తుంటే, అధిష్టానం నిర్ణయాలకు అక్కడ ఏమాత్రం విలువ లేదని అర్థమవుతోందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యల కంటే నాయకుల స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయిందని పేర్కొన్నారు.
సొంత పార్టీ క్రమశిక్షణనే లెక్కచేయని నాయకులు, రేపు ప్రజలు ఇచ్చే తీర్పును కూడా గౌరవించరని సంతోష్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తుందని, నాటకాల రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. సస్పెండ్ అయిన నాయకుడికి లభించిన ఈ స్వాగతంపై తాండూరు నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments