HomeTelanaganahyderabadగంజాయి స్వాధీనం ...!

గంజాయి స్వాధీనం …!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో 1.260 కిలోల గంజాయి స్వాధీనం
  • ముగ్గురి అరెస్ట్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు;. పట్టణంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తాండూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 1.260 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, తాండూర్ టౌన్ పోలీసులు సంయుక్తంగా పట్టణంలో తనిఖీలు చేపట్టారు. స్థానిక విలియం మూన్ స్కూల్ మైదానం సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోదా చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైంది.
నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. పట్టణంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments