- 32వ వార్డులో మిన్నుముట్టిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
- వార్డు ప్రజలతో కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన కౌన్సిలర్ మహేశ్వరి
- మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డులో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కోలాహలంగా సాగాయి. స్థానిక వార్డు కౌన్సిలర్ మహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరి సమక్షంలో కౌన్సిలర్ మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి సగర్వంగా వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్వరి మాట్లాడుతూ… మన దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు.వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాలనీవాసుల సహకారంతో 32వ వార్డులోని సమస్యలను పటాపంచలు చేసి, మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తానన్నారు.
పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
