HomeBusinessక్రెటా, గ్రాండ్ విటారాలకు షాక్ ఇవ్వాల్సింది పోయి.. తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన...

క్రెటా, గ్రాండ్ విటారాలకు షాక్ ఇవ్వాల్సింది పోయి.. తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన సేల్స్

క్రెటా, గ్రాండ్ విటారాలకు షాక్ ఇవ్వాల్సింది పోయి.. తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన సేల్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మోడళ్లు దూసుకుపోతున్నాయి. వీటికి గట్టి పోటీ ఇస్తూ, సరికొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది సరికొత్త రెనాల్ట్ డస్టర్. అయితే, మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఈ కారు విఫలమవుతోంది. ఇండియన్ రోడ్లపై కేవలం నాలుగు నెలల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ఎస్‌యూవీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు సదా సరికదా.. రోజురోజుకూ ఘోరంగా పడిపోతున్నాయి.

మొదట్లో సూపర్‌ హిట్.. ఆ తర్వాత తుస్!
ఈ ఏడాది మార్చి నెలలో కొత్త రెనాల్ట్ డస్టర్ విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి నెల మార్చిలో 1,402 యూనిట్లు అమ్ముడవగా, తర్వాతి నెల ఏప్రిల్‌లో మంచి గ్రోత్ కనిపిస్తూ ఏకంగా 2,359 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. కానీ, ఆ సంతోషం కంపెనీకి ఎంతో కాలం నిలవలేదు. మే, జూన్ నెలల్లో దీని అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మే నెలలో కేవలం 1,267 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, జూన్ వచ్చేసరికి కేవలం 1,011 యూనిట్లతో తన కెరీర్‌లోనే అత్యంత బలహీనమైన రికార్డును మూటగట్టుకుంది. గడిచిన నాలుగు నెలల్లో మొత్తం కలిపి కంపెనీ కేవలం 6,039 డస్టర్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది.

Renault Duster Sales Decline High Features and 5 Star Safety Fail to Boost SUV Sales in India

రెనాల్ట్ ఎస్‌యూవీని పట్టించుకోని కస్టమర్లు
నిజానికి ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, అదిరిపోయే టర్బో ఇంజన్, అద్భుతమైన డిజైన్ లభిస్తున్నా కస్టమర్లు దీని వైపు చూడకపోవడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు మిగతా కంపెనీల మిడ్-సైజ్ ఎస్‌యూవీల అమ్మకాలు ప్రతి నెల విపరీతంగా పెరుగుతుంటే, డస్టర్ గ్రాఫ్ మాత్రం కిందకు పడిపోవడం రెనాల్ట్ కంపెనీని ఆందోళనకు గురిచేస్తోంది. టాటా సియెర్రా, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి కార్ల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని డస్టర్ తట్టుకోలేకపోతోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడు పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు
అమ్మకాల సంగతి పక్కన పెడితే పర్ఫార్మెన్స్ పరంగా కొత్త డస్టర్‌లో రెనాల్ట్ సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో కస్టమర్ల కోసం ఏకంగా మూడు ఇంజన్ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. బేస్ వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండగా, రెండోది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 163 PS పవర్, 280 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక మూడోది మైలేజ్ ప్రియుల కోసం తీసుకొచ్చిన 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్.

Renault Duster Sales Decline High Features and 5 Star Safety Fail to Boost SUV Sales in India

దీనికి 1.4 kWh బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. ఈ హైబ్రిడ్ వెర్షన్ కారు సిటీ లోపల 80 శాతం వరకు కేవలం ఈవీ (EV) మోడ్‌లోనే రన్ అవుతుంది. దీనివల్ల పెట్రోల్ ఖర్చు చాలా వరకు తగ్గి అద్భుతమైన మైలేజ్ వస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

700 లీటర్ల భారీ బూట్ స్పేస్
కొత్త రెనాల్ట్ డస్టర్ సైజ్ మరియు స్పేస్ పరంగా ఈ సెగ్మెంట్‌లో చాలా స్ట్రాంగ్‌గా నిలుస్తుంది. ఈ కారు పొడవు 4,346 mm, వెడల్పు 1,815 mm, ఎత్తు 1,703 mm, వీల్‌బేస్ 2,657 mm గా ఉంది. ఇండియన్ రోడ్లపై గుంతలను సులభంగా దాటడానికి వీలుగా ఇందులో 212 mm ల భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఇచ్చారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 700 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారికి, ఎక్కువ లగేజీ తీసుకెళ్లే వారికి ఈ స్పేస్ ఒక వరమనే చెప్పాలి. బయట డిజైన్ విషయానికి వస్తే ఎకో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు రూఫ్ స్పాయిలర్‌తో కారు చాలా లగ్జరీగా కనిపిస్తుంది.

35 అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, ADAS సిస్టమ్‌
ప్రయాణీకుల రక్షణ విషయంలో ఈ ఎస్‌యూవీకి తిరుగులేదు. డస్టర్ కారులో కంపెనీ ఏకంగా 35 కి పైగా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను అందించింది. ఇందులో ప్రమాదాలను ముందుగానే గుర్తించి అలర్ట్ చేసే అదాస్ (ADAS) టెక్నాలజీతో పాటు కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి జదరకుండా ఆపే హిల్ డిసెంట్ కంట్రోల్ సిస్టమ్‌ను అమర్చారు. కారు బాడీని చాలా బలంగా రీఇన్‌ఫోర్స్డ్ మెటీరియల్‌తో తయారు చేశారు. డ్రైవింగ్ అనుభూతిని మార్చుకోవడానికి ఎకో, కంఫర్ట్, పర్సో అనే మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

గూగుల్ ఇన్‌బిల్ట్ టెక్నాలజీ
కారు లోపలికి అడుగుపెట్టగానే ఒక ఫ్యూచరిస్టిక్, లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై గూగుల్ ఇన్‌బిల్ట్ సిస్టమ్‌తో పనిచేసే 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్రైవర్ కోసం 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇంకా 60 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, స్కై వ్యూని ఆస్వాదించడానికి పనోరమిక్ సన్‌రూఫ్, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ సీట్లు, పీఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్‌తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్ల మైండ్ సెట్‌ను ఆకర్షించడంలో ఈ కారు వెనుకబడిపోవడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments