- 33వ వార్డు కాంగ్రెస్. అధ్యక్షుడు గా ఆస్తికర్ ఆశిష్ నియామకం
- పార్టీ బలోపేతనికి కృషి
- ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తా: ఆస్తికర్ ఆశిష్
జనవహీని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణం 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆస్తికర్ ఆశిష్ నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, వార్డు కమిటీల ఇంచార్జి బస్వాపురం రాములు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు, వార్డు ఇంచార్జి ప్రహ్లాద్ కులకర్ణి, మాజీ కౌన్సిలర్లు లింగదల్లి రవి కుమార్, ప్రవీణ్ కుమార్ గౌడ్‌లు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆస్తికర్ ఆశిష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వార్డు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిల సహకారంతో వార్డులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అలీం, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోర్వార్ నగేష్, నయీమ్ అఫు, ముస్తఫా, వడ్డే శ్రీనివాస్, ఉర్దూ ఘర్ చైర్మన్ జలాల్, బర్కత్ అలీ, జంగం శివులతో పాటు పలువురు వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.