Home Business స్కోడా కార్ల పై మనసు పారేసుకున్న మనోళ్లు.. కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలతో...

స్కోడా కార్ల పై మనసు పారేసుకున్న మనోళ్లు.. కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలతో సరికొత్త హిస్టరీ

3
0

స్కోడా కార్ల పై మనసు పారేసుకున్న మనోళ్లు.. కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలతో సరికొత్త హిస్టరీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) సంచలన విజయాలతో దూసుకుపోతోంది. గత ఏడాది (2025) సాధించిన అద్భుతమైన వృద్ధిని అదే వేగంతో ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. 2026 సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (H1 2026) కంపెనీ రికార్డు స్థాయిలో మొత్తం 38,894 వాహనాలను విక్రయించింది.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఏకంగా 7.5 శాతం వృద్ధిని సూచిస్తోంది. భారతదేశంలో స్కోడా అడుగుపెట్టిన గత 25 ఏళ్ల చరిత్రలోనే ఇది అత్యుత్తమ అర్ధవార్షిక అమ్మకాలు కావడం విశేషం. కస్టమర్లలో ఈ బ్రాండ్ పట్ల ఉన్న నమ్మకమే ఈ స్థాయి విజయానికి కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Skoda Auto India Achieves Record Sales in H1 2026 with a Solid 7 5 Growth

కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన సరికొత్త కోడియాక్ ఆర్‌ఎస్
ఈ అద్భుతమైన విజయంపై స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త స్ట్రాటజీతో మార్కెట్లోకి తెచ్చిన మోడల్స్ సూపర్ హిట్ అయ్యాయని ఆయన తెలిపారు. కంపెనీ ఇటీవల అప్‌డేట్ చేసిన కుషాక్ (Kushaq), సరికొత్త కోడియాక్ (Kodiaq) మోడళ్లకు కస్టమర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా ప్రీమియం మోడల్ అయిన ‘కోడియాక్ ఆర్‌ఎస్’ (Kodiaq RS) బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిందంటే మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనితో పాటు కొత్తగా వచ్చిన కైలాక్ (Kylaq), లగ్జరీ సెడాన్ స్లావియా (Slavia) కార్లు కూడా కంపెనీ అమ్మకాలను భారీగా పెంచుతున్నాయి.

Skoda Auto India Achieves Record Sales in H1 2026 with a Solid 7 5 Growth

దేశవ్యాప్తంగా 340 కి పైగా టచ్‌పాయింట్లు
భారతదేశంలో కేవలం కార్ల విక్రయాలనే కాకుండా, కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు స్కోడా తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 340 కంటే ఎక్కువ టచ్‌పాయింట్లను (షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు) ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల కస్టమర్లకు ఈ బ్రాండ్‌ను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చింది.

కస్టమర్ల నమ్మకాన్ని, పారదర్శకతను పెంచేందుకు తాజాగా స్కోడా ఎక్స్‌ప్రెస్ కేర్ (Skoda Express Care) అనే సరికొత్త సర్వీసింగ్ విధానాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా తక్కువ సమయంలోనే నాణ్యమైన వాహన సేవలను అందిస్తూ వినియోగదారులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తోంది.

Skoda Auto India Achieves Record Sales in H1 2026 with a Solid 7 5 Growth

ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్కోడా కార్ల రేసింగ్ జోరు!
కేవలం బిజినెస్ పరంగానే కాకుండా, స్కోడా కంపెనీ తన రేసింగ్ డిఎన్‌ఏ, మోటార్‌స్పోర్ట్ వారసత్వాన్ని కూడా గట్టిగా చాటుకుంది. స్కోడా శ్రేణికి చెందిన స్లావియా మాంటే కార్లో, కుషాక్ మాంటే కార్లో, కైలాక్, కోడియాక్ మరియు లిమిటెడ్ ఎడిషన్ అక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS) కార్లు ట్రాక్‌పై దిగి రికార్డులు సృష్టించాయి.

కోయంబత్తూరులోని ప్రసిద్ధ కోఆస్ట్‌ (CoASTT) రేసింగ్ ట్రాక్‌పై ఈ ఐదు వాహనాలు డ్రైవర్ల మార్పిడితో సహా కేవలం 12:30.97 నిమిషాల రికార్డు సమయంలో ల్యాప్‌ను పూర్తి చేశాయి. ఒకే కార్ల తయారీ సంస్థకు చెందిన మల్టీ-కార్ రిలే రేస్‌ విభాగంలో ఈ ఘనత సాధించినందుకు గాను స్కోడా కార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లలో చోటు దక్కించుకున్నాయి. దీనిని పురస్కరించుకుని కంపెనీ గ్రేటెస్ట్ ఆన్ ఎ ట్రాక్ ఈజ్ ఎ స్కోడా ఆన్ ఎ ట్రాక్ అనే కొత్త క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here