Home News ఘనంగా ఆలయ వార్షికోత్సవం..!

ఘనంగా ఆలయ వార్షికోత్సవం..!

136
0
  • భక్తిశ్రద్ధలతో ఘనంగా వరసిద్ది వినాయక ఆలయ వార్షికోత్సవం
  • ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ బంటు వేణు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం సాయిపూర్‌ ఆదర్శ తులసి నగర్ లోని వరసిద్ది వినాయక దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అలంకరణలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక వార్డు కౌన్సిలర్ బంటు వేణును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ చింతన మనిషికి ప్రశాంతతను ఇస్తుందన్నారు. సాయిపూర్ ప్రజలందరిపై వరసిద్ది వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చేపట్టిన ఏర్పాట్లను ఆయన అభినందించారు.ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తిగీతాలు, జయజయధ్వానాలతో మార్మోగాయి.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here