Thursday, April 9, 2026

అక్రమ పనులను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు…!

-

  • కోర్టు తీర్పునకు తూట్లు.. సర్వే నెం. 111లో భూ అక్రమాలు!
  • అధికారులతో కలిసి పనులను అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  • ఆర్డీఓపై అధికార పార్టీ ‘బడా’ నేత ఒత్తిడి అంటూ బిఆర్ఎస్ నాయకుల ఆరోపణలు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : చట్టాలను గౌరవించాల్సిన వారే బేఖాతరు చేస్తూ, అధికార బలంతో భూ కబ్జాలకు పాల్పడుతున్న తీరు తాండూరులో కలకలం రేపుతోందని కారు పార్టీ కౌన్సిలర్ లు అగ్రహించారు.పట్టణంలోని సర్వే నెంబర్ 111లో కలెక్టర్ ఉత్తర్వులను, కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి సాగుతున్న అక్రమ నిర్మాణాలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు గురువారం అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్‌ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి జరుగుతున్న అక్రమ పనులను నిలిపివేయించారు.సర్వే నెంబర్ 111లోని భూమిపై ప్రస్తుతం కోర్టు స్టే అమలులో ఉందని, ఎటువంటి పనులు చేపట్టరాదని కలెక్టర్ ఆదేశాలు కూడా ఉన్నాయన్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమ దారులు రాత్రికి రాత్రే పనులను ముమ్మరం చేశారాని కౌన్సిలర్ లు అన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులతో కలిసి అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.బీఆర్ఎస్ నాయకులు పనులను అడ్డుకోవడంతో సీన్ ఆర్డీఓ ఆఫీస్‌కు మారింది. అధికార పార్టీకి చెందిన ఓ బడా నాయకుడు నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి, నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించేలా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు బిఆర్ఎస్ కౌన్సిలర్ లు చెప్పుకొచ్చారు. కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ఎలా తలొగ్గుతారని కారు పార్టీ కౌన్సిలర్ లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. “అధికార పీఠం అండగా ఉందని కోర్టులను, ఉన్నతాధికారుల ఉత్తర్వులను బేఖాతరు చేయడం దుర్మార్గమన్నారు. ఒక పక్క పనులు ఆపాలని స్టే ఉన్నా, మరోపక్క అధికార పార్టీ నేత ఆర్డీఓపై ఒత్తిడి తేవడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories