Home News మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..!

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..!

313
0
  • బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
  • మృతుని కుటుంబాన్ని ఓదార్చిన కౌన్సిలర్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక నివాసి శ్రీనివాస్ గౌడ్ చిన్న కుమారుడు కార్తీక్ గురువారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 6వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అనిల్ కుమార్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని ప్రకటించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ ఎన్నికల నాటి తన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో తన వార్డు పరిధిలో ఏ కుటుంబంలోనైనా మరణం సంభవిస్తే తక్షణ సహాయం కింద రూ. 5,000 అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, పుత్రశోకంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 5,000 నగదును అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అందజేసి అండగా నిలిచారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here