HomeEntertainmentఅయ్యగారే నెంబర్ వన్.. మళ్ళీ ట్రెండింగ్లోకి అఖిల్ అక్కినేని ఫ్యాన్.!

అయ్యగారే నెంబర్ వన్.. మళ్ళీ ట్రెండింగ్లోకి అఖిల్ అక్కినేని ఫ్యాన్.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


అయ్యగారే నెంబర్ వన్.. మళ్ళీ ట్రెండింగ్లోకి అఖిల్ అక్కినేని ఫ్యాన్.!

Jul 10, 2026 2:53PM

“అయ్యగారే నెంబర్ వన్” అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. గతంలో అఖిల్ అక్కినేని సినిమా విడుదల సందర్భంగా “ఎవరి వల్ల కాదు.. అఖిలే కరెక్ట్.. అయ్యగారే నెంబర్ వన్” అంటూ ఒక డై హార్డ్ ఫ్యాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పటినుంచి అఖిల్ ని అందరూ అయ్యగారు అని పిలవడం స్టార్ట్ చేశారు. తనకంటే తన ఫ్యాన్ ఎక్కువ పాపులర్ అవుతున్నాడంటూ స్వయంగా అఖిల్ ఎంతో సంతోషంగా చెప్పాడంటే.. ఆ ఫ్యాన్ చెప్పిన “అయ్యగారే నెంబర్ వన్” డైలాగ్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ డైలాగ్ చెప్పిన అక్కినేని ఫ్యాన్, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాడు.

అఖిల్ తాజాగా “లెనిన్” సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు.. మొదటి షో నుంచే ఈ సినిమా ఆ నమ్మకాన్ని కలిగించింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో, థియేటర్ల దగ్గర అక్కినేని అభిమానుల హంగామా కనిపిస్తోంది. అయితే ఎంతమంది ఉన్నా “అయ్యగారే నెంబర్ వన్” డైలాగ్ చెప్పిన ఫ్యానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

 

Akhil Akkineni, Lenin Movie, Ayyagaru, Trending, TeluguOne

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments