Home News వికాస్ ను పరామర్శించిన ఎమ్మెల్యే…!

వికాస్ ను పరామర్శించిన ఎమ్మెల్యే…!

333
0
  • వికాస్ ను కలిసినా ఎమ్మెల్యే 
  • కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచన

జనవాహిని ప్రతినిధి తాండూరు :   తాండూరుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ యువనేతను పరామర్శించారు. పార్టీకి చెందిన గురురాజ్ జోషి కుమారుడు, యువనేత జోషి వికాస్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి, కోలుకొని ఇంటికి చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదివారం వికాష్‌ జోషి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వికాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వికాస్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే తో పాటు.. మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి,సురేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,హన్మంతు, కౌన్సిలర్లు  బంటు వేణు, తదితరులు ఉన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here