Home Entertainment లెనిన్ సక్సెస్ అఖిల్, భాగ్యశ్రీ కెరీర్‌కు ఎందుకంత కీలకం?

లెనిన్ సక్సెస్ అఖిల్, భాగ్యశ్రీ కెరీర్‌కు ఎందుకంత కీలకం?

2
0


లెనిన్ సక్సెస్ అఖిల్, భాగ్యశ్రీ కెరీర్‌కు ఎందుకంత కీలకం?

Jul 9, 2026 3:51PM

Google search engine

అఖిల్ అక్కినేని నటించిన సరికొత్త యాక్షన్ డ్రామా ‘లెనిన్’ రేపు(జూలై 10) థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు చిత్ర బృందమంతా ఎంతో ధీమాగా ఉంది. అయితే, ఈ సినిమా సక్సెస్ కేవలం హీరో అఖిల్‌కు మాత్రమే కాదు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకం.

అఖిల్ అక్కినేని గత చిత్రం ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ పరాజయం తర్వాత అఖిల్ దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ 3 సంవత్సరాల గ్యాప్‌లో ఆయనకు ఒక వైపు ఇంజ్యూరీ కావడం, మరోవైపు 2025 ఏప్రిల్ 6న జైనాబ్ రవ్జీతో వివాహం జరగడం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ విరామంలో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్స్ వచ్చాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా గమనించిన తర్వాతే అఖిల్ పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ ‘లెనిన్’ సినిమాను పట్టాలెక్కించారు. 

అర్బన్, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘హాలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాలు అఖిల్‌కు మంచి పేరు తెచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్‌లో ఆయనకు ఇప్పటివరకు ఒక్క సరైన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేదు. అఖిల్ హాలీవుడ్ హీరో తరహాలో చాలా తెల్లని స్కిన్ టోన్ కలిగి ఉండటం వల్ల మాస్ ప్రేక్షకులు ఆయనను అంత త్వరగా ఓన్ చేసుకోలేకపోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే ‘లెనిన్’ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఈ సినిమాలో అఖిల్ తెల్లగా కనిపించడని, అదే ఈ సినిమాకు పెద్ద మాస్ ఎలిమెంట్ అని స్పష్టం చేశారు. ఈ సినిమా గనుక క్లిక్ అయితే, అఖిల్ కెరీర్‌లో నాగార్జున క్లాసిక్ హిట్ ‘జానకి రాముడు’ లాంటి మైలురాయిగా నిలుస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

మరోవైపు, ఈ చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సేకు కూడా ‘లెనిన్’ విజయం అత్యంత ఆవశ్యకంగా మారింది. టాలీవుడ్‌లోకి గ్లామరస్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆమె నటించిన గత తెలుగు సినిమాలు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’, రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయిన ‘కాంత’ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించినా, ఆ సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో శివ కార్తికేయన్ సరసన ‘సియోన్’ చిత్రంలో నటిస్తోంది, అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్‌లో అవకాశాలకు ఢోకా లేకపోయినప్పటికీ, స్టార్ లీగ్‌లోకి వెళ్లాలన్నా, అనుకున్న రేంజ్‌లో రెమ్యూనరేషన్ అందుకోవాలన్నా భాగ్యశ్రీకి ఒక అర్జెంట్ కమర్షియల్ హిట్ అవసరం. జూలై 10న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘లెనిన్’ చిత్రం అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరి బాక్సాఫీస్ జాతకాలను మారుస్తుందో లేదో చూడాలి.

 

 

Lenin Movie, Akhil Akkineni, Bhagyashri Borse

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here