― Advertisement ―

వికాస్ ను పరామర్శించిన ఎమ్మెల్యే…!

వికాస్ ను కలిసినా ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచన జనవాహిని ప్రతినిధి తాండూరు :   తాండూరుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ యువనేతను పరామర్శించారు. పార్టీకి చెందిన గురురాజ్ జోషి...
HomeNEWSజ్ఞాపకాల జడిలో... 2003-04 బ్యాచ్...!

జ్ఞాపకాల జడిలో… 2003-04 బ్యాచ్…!

spot_img
  • 22 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు
  •  కందనెల్లి పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం తమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిత్రులందరూ ఒకేచోట చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో విద్యార్థులంతా అలనాటి పాఠశాల రోజులను, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు గాలయ్య, ఎం.ఏ పాషా, శ్రీదేవి, అరుంధతిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తమను తీర్చిదిద్దిన గురువులను చూసి విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులుఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలన్నా, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలన్నా క్రమశిక్షణ అత్యంత కీలకంమన్నారు. ఇది కేవలం నియమాలను పాటించడం మాత్రమే కాదు, మనల్ని మనం సరైన మార్గంలో నడిపించుకునే ఒక అద్భుతమైన జీవన విధానం అని హితవు పలికారు.సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, 22 ఏళ్ల తర్వాత తమ స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అప్పటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.