Home Business రూ.5.69 లక్షల బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. నెలకు 21000 కార్ల విక్రయం.. దేశంలోనే నం.1...

రూ.5.69 లక్షల బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. నెలకు 21000 కార్ల విక్రయం.. దేశంలోనే నం.1 కారు

3
0

రూ.5.69 లక్షల బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. నెలకు 21000 కార్ల విక్రయం.. దేశంలోనే నం.1 కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సంస్థకు చెందిన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ విజయ విహారం చేస్తోంది. ఈ కారుకు దేశీయంగా ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి తాజాగా నమోదైన అమ్మకాల గణాంకాలే నిదర్శనం. ప్రస్తుత 2026 సంవత్సరపు ప్రథమార్ధంలో అంటే జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 ఎస్‌యూవీగా టాటా పంచ్ సరికొత్త రికార్డు సృష్టించింది.

Google search engine

ఈ ఆరు నెలల కాలంలోనే ఏకంగా 1,13,651 లక్షల ఇళ్లకు ఈ కారు చేరిపోయింది. ఇక గత జూన్ 2026 నెలలోనే రికార్డు స్థాయిలో 21,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలోనే మోస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Tata Punch Becomes Indias Best-Selling SUV With Premium Features at Rs 5 69 Lakh

టాటా పంచ్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి దాని మస్కులర్, బోల్డ్ లుక్కే ప్రధాన కారణం. ఈ కారు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్, ఎల్ఈడీ డిఆర్ఎల్స్‎తో పాటు 193 మిమీల అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. దీనివల్ల ఎలాంటి గుంతల రోడ్లపై అయినా ఈ కారు సాఫీగా సాగిపోతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, కేబిన్‌ను చాలా మోడ్రన్‌గా డిజైన్ చేశారు.

ఇందులో 10.25 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, షార్క్ ఫిన్ యాంటెన్నా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tata Punch Becomes Indias Best-Selling SUV With Premium Features at Rs 5 69 Lakh

పర్ఫార్మెన్స్ పరంగా టాటా పంచ్‌లో 1.2 లీటర్ల రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 87bhp పవర్‌ను, 115Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి అదనంగా ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ ప్రయాణాన్ని ఇష్టపడే వారి కోసం 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే మిడిల్ క్లాస్ కస్టమర్ల కోసం టాటా సంస్థ తన విప్లవాత్మక ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇది బూట్ స్పేస్ తగ్గకుండా ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Tata Punch Becomes Indias Best-Selling SUV With Premium Features at Rs 5 69 Lakh

మైలేజ్ విషయంలోనూ టాటా పంచ్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని నార్మల్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 18.9 కిమీ నుంచి 20 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో దీని CNG వేరియంట్ ఒక కేజీ గ్యాస్‌కు ఏకంగా 23.5 కిమీ నుంచి 26.99 కిమీ వరకు మైండ్ బ్లోయింగ్ మైలేజీని అందిస్తూ కస్టమర్ల ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తోంది.

లగేజ్ విషయానికి వస్తే.. ఈ మైక్రో-ఎస్‌యూవీలో సామాన్లు సర్దుకోవడానికి 366 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్‌లో రెండు చిన్న సిలిండర్లు అమర్చడం వల్ల ఈ స్పేస్ కాస్త తగ్గి 210 లీటర్లుగా ఉంటుంది. సేఫ్టీ పరంగా టాటా పంచ్ దేశంలోనే అత్యంత నమ్మకమైన కారుగా పేరు తెచ్చుకుంది. భారత్ ఎన్‌క్యాప్, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రేష్ టెస్టుల్లో ఈ కారు ప్రతిష్టాత్మకమైన పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

వినియోగదారుల ప్రాణ రక్షణ కోసం కంపెనీ ఈ కారు బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.69 లక్షల నుండి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.10.67 లక్షల వరకు ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఎక్స్టర్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here