Home News బర్త్డే వేడుకల్లో శ్రీనివాస్ రెడ్డి, గద్దర్…!

బర్త్డే వేడుకల్లో శ్రీనివాస్ రెడ్డి, గద్దర్…!

810
0
  • సామాజిక స్పృహ కలిగిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి
  •  చిన్నారి ఐరా జన్మదిన వేడుకల్లో సందడి
  • గద్దర్ గొంతు.. లక్ష్మణ్ కలం.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ పలకరింపు..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : షాద్‌నగర్ నియోజకవర్గం, నిర్ధవెళ్లి గ్రామంలో ప్రముఖ పాటల రచయిత బుల్లెట్ బండి లక్ష్మణ్ కుమార్తె ఐరా జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు.పారిశ్రామికవేత్తగా, సేవా దృక్పథం కలిగిన నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నిత్యం ప్రజలతో మమేకమవుతూ అభినందనలు అందుకుంటున్నారు. కళాకారుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు సైతం ప్రాధాన్యతనిస్తూ, సామాన్యులతో ఆత్మీయ సంబంధాలను పెంపొందించుకోవడంలో ఆయన ముందుంటారని ఈ వేడుక మరోసారి నిరూపించింది. ఈ వేదికపై సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన బుల్లెట్ బండి లక్ష్మణ్, గాన గంధర్వుడిగా పేరొందిన నల్లగొండ గద్దర్ మరియు ప్రజాసేవలో క్రియాశీలంగా ఉండే శ్రీనివాస్ రెడ్డి పాలుపంచుకోవడం విశేషం. సాహిత్యం, సంగీతం మరియు సామాజిక బాధ్యత కలిసిన ఈ అరుదైన కలయిక కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కళాకారులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతులన్నారు. అటువంటి వారి కుటుంబ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారి ఐరా ఉత్తమ భవిష్యత్తును కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. వేడుకకు హాజరైన గ్రామస్థులు, అభిమానులు శ్రీనివాస్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here