Home Entertainment Huma qureshi: బాలీవుడ్ పై హుమా ఖురేషి ఫైర్.. హీరోయిన్ అంటే అది మాత్రమేనా!

Huma qureshi: బాలీవుడ్ పై హుమా ఖురేషి ఫైర్.. హీరోయిన్ అంటే అది మాత్రమేనా!

5
0


Huma qureshi: బాలీవుడ్ పై హుమా ఖురేషి ఫైర్.. హీరోయిన్ అంటే అది మాత్రమేనా!

Jul 9, 2026 4:21PM

Google search engine

 

హుమా ఖురేషి(.. భారతీయ సినీ రంగానికి దొరికిన ముగ్ద మనోహర రూపంతో కూడిన హీరోయిన్.  ఆమె సినీ ప్రస్థానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘కాలా’ మరో సూపర్ స్టార్ అజిత్ తో ‘వలిమై’ చిత్రాల్లో కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తురాలు. మొన్న 3న ‘బేబీ డూ డై డూ’ అనే హిందీ  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హుమా ఖురేషి చేసిన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

మహిళా క్యారెక్టర్స్ ని కేవలం ఒక అందాల వస్తువులా, ఆకర్షణీయంగా చూపించడమే లక్ష్యంగా కథలు రాయడంతో  సినిమా ఇండస్ట్రీ సరైన దిశలో వెళ్లడం లేదని అనిపిస్తుంది. మహిళలకి మరింత బలమైన, లోతైన, వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని  సృష్టించాల్సిన అవసరం నేటి దర్శకులు, రచయితలపై ఎంతైనా ఉంది. నా తాజా చిత్రం ‘బేబీ డూ డై డూ’ లో పైకి ఎంతో సాదాసీదాగా కనిపించే ‘బేబీ కర్మార్కర్’ క్యారక్టర్ అ వసరమైన సమయంలో ఎంతటి ప్రమాదకరమైన ప్రొఫెషనల్ కిల్లర్‌గా మారుతుందో సినిమాలో చూపిస్తాం. ఒక క్యారక్టర్ కి ఉండే అసలైన బలం గ్లామర్ లేదా ఎక్స్‌పోజింగ్‌లో ఉండదు.కేవలం నటన మరియు ఆ రోల్  యొక్క డెప్త్‌లోనే ఉంటుందని ఈ సినిమా ద్వారా నిరూపించాలనుకున్నామని ఆమె వెల్లడించారు.

Also read: Chiranjeevi: వయసు 70 , ఫ్యాషన్ మాత్రం 25 ..హ్యాట్సాఫ్ చిరు 

దర్శకుడు నాచికేత్ సామంత్ తెరకెక్కించిన ఈ ‘బేబీ డూ డై డూ’ చిత్రాన్ని హుమా ఖురేషి తన సోదరుడు సాఖిబ్ సలీమ్‌తో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం. కేవలం కమర్షియల్ హంగుల వెనుక పరిగెత్తకుండా, ఇండస్ట్రీలో సరికొత్త మార్పు కోసం ఇలాంటి భిన్నమైన స్క్రిప్ట్‌లను సపోర్ట్ చేయడమే తన బ్యానర్ లక్ష్యమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. అలాగే ఆగస్టు 26న విడుదల కాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) లో కన్నడ సూపర్ స్టార్ యష్ మరియు దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌లతో కలిసి పనిచేసిన తన అద్భుతమైన అనుభవాలను కూడా ఈ సందర్భంగా హుమా పంచుకున్నారు. హీరోయిన్ల కేరెక్టరైజేషన్ మారాలని హుమా చేసిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపాయి.

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here