Wednesday, February 4, 2026
Home NEWS మున్సిపల్ లో బిఆర్ఎస్ జెండా ఖాయం…!

మున్సిపల్ లో బిఆర్ఎస్ జెండా ఖాయం…!

0
357
  • మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానే…! 
  • మున్సిపల్ చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు ఖరారు
  •  ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల పేర్లను ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించబోతుందని, మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని మరియు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికపై ఆయన కీలక ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని పట్లోళ్ల నర్సింలు అధిష్టించబోతున్నారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమర్థుడైన నాయకత్వాన్ని పార్టీ ఎంపిక చేసిందని ఆయన పేర్కొన్నారు.కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో సామాజిక సమతుల్యతపార్టీ నుంచి నామినేట్ చేసే నలుగురు కో-ఆప్షన్ సభ్యులలో ముగ్గురి పేర్లను రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. సామాజిక సమీకరణాలు మరియు అనుభవానికి పెద్దపీట వేస్తూ ఈ ఎంపిక జరిగినట్లు తెలిపారు.* మైనారిటీ కోటా: ఇర్ఫాన్* మహిళా కోటా: సంగీత టాకూర్అనుభవజ్ఞుల కోటా: మున్సిపల్ వ్యవహారాల్లో అపారమైన అవగాహన ఉన్న రాము ముదిరాజ్ ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.నాలుగో కో-ఆప్షన్ సభ్యుడి పేరును ఎన్నికల ఫలితాల అనంతరం వెల్లడిస్తాం అని ఆయన వివరించారు. ఈ నిర్ణయంతో పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహం నెలకొందని, భారీ మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here