Nithi Kamat trading tips : స్ప్రెడ్స్ వంటి పూర్తి హెడ్జ్డ్ ఆప్షన్స్ వ్యూహాలను ఎలా ఉపయోగించాలో సెన్సిబుల్ చేసిన పోస్ట్​ను షేర్ చేస్తూ.. ” స్టాక్​ మార్కెట్ ఏమి చేసినా, బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బేర్​ పుట్ స్ప్రెడ్ వంటి స్ప్రెడ్​ను మీరు ట్రేడ్ చేస్తే నష్టం పరిమితమవుతుంది. మీ నష్టాలు నిర్ణీత సంఖ్యను మించవు,” అని నితిన్​ కామత్​ అన్నారు.

“సులభంగా డబ్బు సంపాదించేందుకు అతి కష్టమైన మార్గం ఏదైనా ఉందంటే.. అది ట్రేడింగ్​ మాత్రమే! ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఒక సక్సెస్​ఫుల్​ ట్రేడర్​ అవ్వాడానికి ట్రిక్.. మార్కెట్​లో బ్యాడ్​ డేస్​ని తట్టుకుని నిలబడటం,” అని నితిన్​ కామత్​ పేర్కొన్నారు.

Stock market trading tips in Telugu : “గత సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా, ఎక్స్​పైరీ రోజుల్లో ఆప్షన్ ధరల్లో సడెన్​ స్పైక్​ కనిపిస్తోంది. ట్రేడర్లు ట్రాప్​ అయిపోతున్నారు,” అని ఆయన అన్నారు.