TS TET Mock Exams 2024: తెలంగాణలో టెట్(TS TET 2024) దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

తెలంగాణ టెట్ పరీక్షలు(Telangana TET Exams 2024) మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు కొనసాగుతాయి. ఈసారి ఆన్ లైన్ లో పరీక్షలు జరగనున్నాయి.  మే 15 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఫలితాలు జూన్‌ 12న విడుదల చేయనున్నారు. మరోవైపు కీలకమైన డీఎస్సీ ఉన్న నేపథ్యంలో…. టెట్ స్కోరు కీలకంగా మారింది. కేవలం స్కోర్ మాత్రమే కాదు… చాలా మంది క్వాలిఫై కావటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతున్నప్పటికీ పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ మాక్ టెస్టులను ఎలా రాయాలో ఇక్కడ చూడండి…

తెలంగాణ టెట్ మాక్ టెస్టులు రాసుకోవచ్చు….

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో పైన కనిపించే TS TET Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  • ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
  • ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

TS TET Key Dates 2024 : తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు:

  • తెలంగాణ టెట్ – 2024
  • టెట్ హాల్ టికెట్లు – మే 15, 2024.
  • పరీక్షలు ప్రారంభం – మే 20, 2024.
  • పరీక్షల ముగింపు – జూన్ 06,2024.
  • టెట్ ఫలితాలు – జూన్ 12, 2024.
  • అధికారిక వెబ్ సైట్ – https://schooledu.telangana.gov.in/ISMS/