మూడేళ్ల కిందట వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‍గా ఇప్పుడు పుష్ప 2: ది రూల్ మూవీ వస్తోంది. ఈ సీక్వెల్ మూవీని మరింత భారీగా రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న పుష్ప 2 కలెక్షన్ల రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు మెండుగా ఉన్నాయి. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలకు మించి..

పుష్ప 2 సినిమాకు తెలుగుతో సమానంగా హిందీలోనూ ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ ఏకంగా రూ.200కోట్లకు తీసుకుంది. దీంతో ఉత్తరాది థియేట్రికల్ రైట్స్ విషయంలో బాలీవుడ్ చిత్రాలను కూడా బీట్ చేసి పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15న తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పుష్ప 2 రిలీజ్ కానుంది.

పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. త్వరలోనే చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.