Mercury transit: గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించినప్పుడు విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. వైవాహిక జీవితంలో, వృత్తి, వ్యాపారాలు, విద్య వంటి వాటిలో అనేక హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గ్రహాల ప్రత్యక్ష, తిరోగమన సంచారాల ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది.

ఇప్పటి వరకు తిరోగమన దశలో ప్రయాణించిన బుధుడు నేటి నుంచి ప్రత్యక్ష మార్గంలో పయనిస్తాడు. ఏప్రిల్ 25 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు మీన రాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తున్నాడు.

మీన రాశి బుధుడు అత్యల్ప రాశి చక్రంగా పరిగణిస్తారు. బుధుడు మీనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తెలివితేటలు బలహీనపడతాయి. వ్యాపారం చేయడంలో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ, వైవాహిక సంబంధాలు క్షీణిస్తాయి. అయితే వీరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి నుంచి ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది.

మీన రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ లో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఏయే రాశుల వారికి బుధుడి కదలిక ప్రతికూల ఫలితాలు ఇస్తుందో చూద్దాం.

మేష రాశి

బుధుడి ప్రత్యక్ష సంచారం మేష రాశి ఉద్యోగులకు సవాళ్ళని తీసుకొస్తుంది. వృత్తి జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. అప్పుడే కెరీర్ ని సరైన మార్గంలో నడిపించుకోగలుగుతారు. కానీ పని భారం గణనీయంగా పెరుగుతుంది. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం కష్టమవుతుంది. ఉన్నతాధికారులు పనిలో మీరు చూపించే శ్రమను గుర్తించకపోవచ్చు. ఆదాయ వృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది. ఉద్యోగాలు మారేందుకు ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం వల్ల మీకు ఒక ప్రయోజనం ఉండకపోవచ్చు. విదేశాల్లో పని చేసేందుకు అవకాశం వస్తుంది. కానీ వాటితో సంతృప్తి చెందలేరు.

సింహ రాశి

బుధుడి కదలిక సింహ రాశి వారికి ప్రయోజనం కలిగించకపోవచ్చు. ఉద్యోగం, వృత్తిపై గొప్ప ఆశలు పెట్టుకోవద్దు. ఈ కాలంలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. వృత్తిపరమైన ఆశయాలు నెరవేర్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో తీవ్ర ఆటంకాలు ఉంటాయి.

వృశ్చిక రాశి

ఉద్యోగంలో మార్పు కోసం ఆశిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. కానీ కొత్త ఉద్యోగం అసౌకర్యంగా, అసంతృప్తిగా ఉంటుంది. ఈ పరిస్థితి వల్ల కొద్దిగా ఆందోళనకు గురవుతారు. మీ పనికి ప్రశంసలు దక్కకపోగా విమర్శలు ఎదురవుతాయి. మీరు చేసే ఉద్యోగంలో మీ కృషిని పర్యవేక్షకులు విస్మరిస్తారు.

కుంభ రాశి

బుధుడి ప్రత్యక్ష మార్గం కుంభ రాశి వారికి పనుల్లో విజయం సాధించడంలో కష్టమవుతుంది. పురోగతి కోసం వేచి ఉండాల్సి వస్తుంది. కెరీర్ లో విజయం సాధించడానికి నిరంతరాయంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారితో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. అది మీ పనిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కార్యాలయంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. మీ ప్రయత్నాలకు ప్రశంసలు అందుకోలేరు. ఫలితంగా మీరు నిరాశకు గురవుతారు. కష్ట సమయాలు ముగిసిన తర్వాత ప్రతిదీ చక్కగా ఉంటుంది. మీ ఉద్యోగ లక్ష్యాలను మీరు చేరుకోగలుగుతారు.