Krishna mukunda murari serial april 24th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రేవతి భవానీ దగ్గరకు వచ్చి ఆదర్శ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడని చెప్తుంది. ఏమైనా అంటే నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు, నా సంతోషం ఎవరికి పట్టదని అంటున్నాడని చెప్తుంది. ఈసారి అలా అంటే దవడ పగలగొట్టమని భవానీ కోపంగా చెప్తుంది.

ఆదర్శ్ చెంప పగలగొట్టమన్న భవానీ

కృష్ణ అంటే ఎందుకు వాడికి కోపం పాపం తనేం చేసిందని భవానీ అంటుంది. ఏమో అక్క మొన్నటి వరకు మురారి అంటే కోపం ఇప్పుడు వాడితో బాగానే ఉంటున్నాడు ఆ కోపం కృష్ణ మీద చూపిస్తున్నాడని చెప్తుంది. అదేంటి ఉంటే ఇద్దరి మీద కోపం ఉండాలి ఒకరి మీద ఉండటం ఏంటి?

కోపం ఉంటే ముకుంద మీద ఉండాలి తను పోయిందని ఆ కోపం మిగతా వాళ్ళ మీద చూపిస్తే ఎలా? వాడు ఎప్పుడు ఎలా ఉంటున్నాడో తెలియడం లేదు. అందుకే మీరాతో పెళ్లి అంటే ఆలోచిస్తున్నాను. వాడు అడిగాడు కదాని అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేస్తే తర్వాత ఏదైన జరిగితే కుదరదు.

ముందు వాడికి కృష్ణ మీద ఎందుకు కోపం ఉందో తేలాలి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలని భవానీ తేల్చి చెప్తుంది. మురారి దేవుడి ముందు దీపం వెలిగించి కృష్ణ కోసం బాధపడతాడు. నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నా చెప్తే ఏమైపోతుందోనని భయం.

మీరా ఉచ్చులో మురారి

కృష్ణకి ఎందుకు అన్యాయం చేస్తున్నావ్. తనకి ఎలా నిజం చెప్పాలని బాధపడతాడు. ముకుంద వచ్చి మురారితో మాట్లాడుతుంది. మురారి నుంచి నిజం రాబట్టేందుకు ట్రై చేస్తుంది. నాకొక ఫ్రెండ్ ఉంది తనకి క్యాన్సర్ కానీ ఈ విషయం తనకి తెలియదు. నాకు మాత్రమే తెలుసు తనకి ఎలా చెప్పాలా అని ఆలోచించాను అంటుంది.

ఇదేదో తన పరిస్థితిలానే ఉందని మురారి అనుకుంటాడు. తనని కలవడం మానేశాను, ఫోన్ చేయడం మానేశాను పూర్తిగా దూరం పెట్టేశానని చెప్తుంది. అదేంటి మీ ఫ్రెండ్ కి బాగోకపోతే దగ్గరుండి చూసుకోవాలి కదా అంటాడు. నేను రోజు తనని కలిసి మాట్లాడితే ఏదో ఒక క్షణంలో బాధ తట్టుకోలేక నిజం చెప్పేస్తాను.

క్యాన్సర్ అని తెలిస్తే దాని గురించే ఆలోచించి చనిపోతుందని కథ అల్లుతుంది. ఇన్ డైరెక్ట్ గా కృష్ణకి మురారిని దూరంగా ఉంచమని సలహా ఇస్తుంది. మనం ఎవరి మేలైన కోరుకుంటే దూరంగా ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి అనుకుంటాడు.

కృష్ణకి దూరంగా ఉండాలి

మీరా చెప్పింది నిజమే కృష్ణకి ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా నిజం చెప్పేస్తాను. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. ఒక్కోసారి దగ్గరగా ఉండటం కంటే దూరంగా ఉండటమే మేలు చేస్తుందని అంటాడు. మురారి ఇక నుంచి కృష్ణకి దూరంగా ఉంటాడని ముకుంద సంబరపడుతుంది.

కృష్ణ నిద్రలేచి మురారి కోసం చూస్తుంది. ఇక నుంచి మనకి ఏ టెన్షన్ లేదు పెద్దత్తయ్య కోరిక తీర్చడం తప్ప అని కృష్ణ మురారికి దగ్గరగా వెళ్తుంది. కానీ మురారి చలనం లేకుండా నిలబడతాడు. కృష్ణ మురారి భుజాల మీద చేతులు వేసి ప్రేమగా నిలబడుతుంది. కానీ మురారి ముకుంద మాటలు గుర్తు చేసుకుని తనని పట్టించుకోకుండా కృష్ణ చేతిని తీసేస్తాడు.

చచ్చిపొమ్మన్న పరిమళ

నీకు దగ్గరగా ఉంటే ఎక్కడ నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. నీకు బిడ్డని దూరం చేశాడు. నీకు నేను దగ్గరగా ఉండకుండా చేశాడని మురారి దేవుడిని నిందిస్తాడు. మురారి పరిమళ దగ్గరకు వస్తాడు. ఏం చేయాలో తెలియడం లేదు చచ్చిపోవాలని అనిపిస్తుందని అంటాడు.

చచ్చిపో అని వెటకారంగా మాట్లాడుతుంది. అంత పెద్ద సమస్య ఏమొచ్చింది. కృష్ణకి పిల్లలు పుట్టరని తెలుసు అందుకని చచ్చిపోతారా? దేశంలో ఎంత మంది తల్లిదండ్రులు పిల్లలు లేకపోయినా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కృష్ణని ప్రేమగా చూసుకోమని చెప్తుంది.

నిజం చెప్పేయ్

అది కూడా కుదరడం లేదు కృష్ణతో ఎక్కువగా మాట్లాడితే నిజం చెప్పేస్తానని భయంగా ఉంది. తప్పించుకుని తిరుగుతున్నానని అంటాడు. నిజం చెప్పేయమని చెప్తుంది. కృష్ణకి నిజం చెప్పేవరకు బాధని భరించాలి తప్పదు. నిజాన్ని ఎవరికీ చెప్పకుండా నీలోనే దాచుకున్నావ్ కాబట్టి నీకు ఇంత బాధగా ఉంది.

కృష్ణకి నిజం చెప్పలేకపోతే అమ్మకి చెప్పు. భవానీ ఆంటీకి చెప్పు బాధ పంచుకుంటేనే తగ్గుతుంది. అది తన వల్ల కాదని పెద్దమ్మకి తెలిస్తే అసలు తట్టుకోలేదని అంటాడు. అయితే నాలుగు రోజుల తర్వాత కృష్ణని హాస్పిటల్ కి తీసుకురా తనకి కడుపులో చిన్న గడ్డ ఉందని చెప్పి ఆపరేషన్ చేస్తానని అంటుంది.

భవానీ కోరిక తీర్చమన్న రేవతి

కృష్ణకి ఎలా నిజం చెప్పాలో ఆలోచించమని చెప్తుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏసీపీ సర్ అదోలా ఉంటున్నారని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి వచ్చి మాట్లాడుతుంది. భవానీ కృష్ణ గురించి మాట్లాడిన మాటలు చెప్తుంది.

నువ్వు ఆవిడకు ఏవైనా తిరిగి ఇవ్వగలను అనుకుంటే ఆవిడ నీమీద పెట్టుకున్న ఆశని తీర్చమని చెప్తుంది. పిల్లలు కావాలన్న పెద్దత్తయ్య కోరిక నెరవేర్చడం కంటే మరొక ఆశ కానీ ధ్యాస కానీ లేదని కృష్ణ అంటుంది. ముకుంద వచ్చి కోడలు అంటే ఇలా ఉండాలని, ఇంత గొప్ప కుటుంబం ఎక్కడ ఉంటుందని చెప్తుంది.

ముకుంద శాడిజం

నీకోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి బొమ్మలని బహుమతిగా ఇస్తుంది. అవి చూసి కృష్ణ చాలా సంతోషపడుతుంది. ఈ బొమ్మల్ని నీకు ఇచ్చింది ఇలాంటి బిడ్డని కనాలని కాదు రేపు ఇలాంటి బిడ్డలని కనలేనని చెప్పి తెలుసుకుని కుమిలి కుమిలి ఏడవాలి అనుకుంటుంది.

ఆదర్శ్ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. నీ నోటి చలవ వల్ల ఈ ఇంట్లో మనవడో మనవరాలో తిరిగితే బాగుండని రేవతి అంటుంది. మీ కోరిక తప్పకుండా తీరుతుందని చెప్తుంది. ముకుంద ప్రవర్తన అసలు అర్థం కావడం లేదు నాకేమో కృష్ణ మంచిది కాదని చెప్తుంది. కానీ కృష్ణకి బాగోకపోతే హాస్పిటల్ కి పరిగెత్తింది, కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేయాలని చూస్తుంది. ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయిని అసలు వదులుకోకూడదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు.

కృష్ణని దూరం పెట్టిన మురారి

మురారి కృష్ణకి ఎలాగైనా నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ బొమ్మలు పట్టుకుని వస్తే తన మొహం కూడా చూడకుండా ఫేస్ పక్కకి తిప్పేసుకుంటాడు. బొమ్మల్ని చూపిస్తుంది. తనకి బొమ్మల్ని మీరా ఇచ్చిందని చెప్తుంది.

మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు పెద్దత్తయ్య నా గురించి గొప్పగా మాట్లాడారంట. నేను పిల్లలని కంటానని ఈ వంశానికి వారాసులని ఇస్తానని ఇంట్లో అందరూ నన్ను ఎంత అపురూపంగా చూస్తున్నారో అంటుంది. మురారి మాత్రం డల్ గా ఉంటాడు.

తరువాయి భాగంలో..

ఆదర్శ్ ముకుందకు గులాబీలు ఇచ్చి ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేస్తాడు. అది కృష్ణ, మురారి కూడా చూస్తారు. ముకుంద షాక్ అవుతుంది. నువ్వు సరే అంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. కృష్ణ వచ్చి పూలు నేలకేసి కొడుతుంది.