TS Inter Supplementary Exams Date : తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల(TS Inter Supplementary Time Table) తేదీలను బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మే/జూన్ 2024 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు, ప్రాక్టికల్స్ తేదీలను ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్స్ తేదీలు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 03 నుంచి 07వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం మధ్యాహ్నం సెషన్ 2:00 P.M. నుంచి 5:00 PM వరకు ఉంటుంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష (1వ సంవత్సరం విద్యార్థులకు) జూన్ 10, 2024(సోమవారం) ఉదయం 9:00 నుండి నిర్వహించనున్నారు.

ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 11, 2024న ఉదయం 10:00 AM నుంచి 1:00 PM వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష(2వ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే) జూన్ 12వ తేదీ ఉదంయ 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 నిర్వహిస్తారు.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు(TS Inter Supplementary Time Table)

(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)

  • 24-05-2024(శుక్రవారం) : Part II – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 25-05-2024(శనివారం) : Part I -ఇంగ్లిష్ పేపర్-1
  • 27-05-2024(సోమవారం) : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 28-05-2024(మంగళవారం) : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • 29-05-2024(బుధవారం) : పిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
  • 30-05-2024(గురువారం) : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
  • 31-05-2024(శుక్రవారం) : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
  • 01-06-2024(శనివారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

తెలంగాణ ఇంటర్ సెకండియ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు(TS Inter Supplementary Time Table)

(మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు)

  • 24-05-2024(శుక్రవారం) : Part II – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • 25-05-2024(శనివారం) : Part I -ఇంగ్లిష్ పేపర్-2
  • 27-05-2024(సోమవారం) : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
  • 28-05-2024(మంగళవారం) : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
  • 29-05-2024(బుధవారం) : పిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • 30-05-2024(గురువారం) : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
  • 31-05-2024(శుక్రవారం) : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
  • 01-06-2024(శనివారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు.