Father Son Duo Drown : కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా తండ్రీ కొడుకులిద్దరి ప్రాణాలు(Father Son drowned) తీసింది. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన ఎస్ఆర్కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి తన ఇద్దరు కొడుకులతో వచ్చునూర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్(Lower Manair Dam) లో ఈతకు వెళ్లారు. పెద్దకొడుకును ముందుగా ఈత కోసం డ్యామ్ లోకి తీసుకెళ్లిన రంగారెడ్డి కాసేపు ఈత(Swimming) కొట్టించి ఒడ్డుకు చేర్చాడు. తర్వాత చిన్నకొడుకు క్రోమోజోయ్ రెడ్డి(9) ని డ్యామ్ నీళ్లలోకి తీసుకెళ్లి ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు నీటమునిగారు. కొడుకు కోసం తండ్రి ఆతృతగా వెతుకుతుండగా ఇద్దరు బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే తండ్రి, తమ్ముడు నీటమునగడంతో పెద్దబ్బాయి ఏడుస్తూ కేకలు వేయడంతో స్థానికులు వెలికితీసే సరికే ఇద్దరు మృతి చెందారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రోదనలతో గుండ్లపల్లి గొల్లుమంది. విద్యాసంస్థ ప్రతినిధిగా అందరికి సుపరిచితులైన రంగారెడ్డి కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో విషాదం అలుముకుంది.

వేసవి సెలవుల మొదటి రోజే శాశ్వత సెలవు

స్కూళ్లకు బుధవారం నుంచి వేసవి సెలవులు(TS Summer Holidays) కావడంతో ఈతకు(Swimming) వెళ్లి తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తుంది. స్కూల్ ఉన్నా ఇద్దరి ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్కూల్ కరస్పాండెంట్ గా చాడ రంగారెడ్డి నిత్యం బిజీగా ఉండే వ్యక్తి. సెలవులు కావడంతో ఇద్దరు కొడుకులకు(Father Son Died) ఈత సరదా తీర్చేందుకు సమీపంలోని డ్యామ్ కు వెళ్లారు. పెద్ద కొడుకుకు ఈత రాగ, చిన్నకొడుక్కి ఈత రాదు. చిన్నకొడుకు ఒడ్డువైపు తక్కున నీళ్ల ఉన్న వైపే ఈత కొడుతు బురదలో కూరుకుపోయాడు. అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు తండ్రి రంగారెడ్డి ప్రయత్నిస్తుండగా అతను సైతం బురదలో కూరుకుపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. స్కూల్ కు సెలవులు(Schools Holidays) లేకుంటే ఈత కోసం వెళ్లేవారు కాదని సెలవులే వారికి శాశ్వత సెలవు ఇచ్చిందని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

డ్యామ్ లో దూకి బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

కరీంనగర్(Karimnagar) లో జ్యోతినగర్ లో నివాసం ఉండే బ్యాంక్ ఉద్యోగిని(Bank Employee) పుల్లూరి అనుషా లోయర్ మానేర్ డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు(suicide) గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి కుటుంబకలహాలే కారణమని స్థానికులు బావిస్తున్నారు. భర్తతో గొడవ పడి మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనుషా తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం డ్యామ్ లో శవమై తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY,KARIMNAGAR