Vastu tips for home: వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచుకోవాలంటే పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండేందుకు నిరాకరిస్తుందని చెప్తారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని దుమ్ము, ధూళి, బూజు లేకుండా చూసుకోవాలని అంటారు.

తరచుగా ఇంటిని శుభ్రంగా పరిచినప్పటికీ ఇంటి పైకప్పు మూల అందకపోవడం వల్ల కొంతమంది శుభ్రం చేయకుండా వదిలేస్తారు. మరికొందరు నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉంటారు. ఇలా చేస్తే సాలీళ్ళు గూళ్ళు పెట్టేస్తాయి. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయి. సాలెపురుగులు వల్ల వచ్చిన్ బూజుతో ఇల్లు అందమంతా పోతుంది. చూసేందుకు చాలా మురికిగా ఉంటుంది.

ఇంట్లో సాలెపురుగులు ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎప్పుడు డబ్బు కొరత ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల స్వభావంలో సోమరితనం, చిరాకు, ప్రతికూలత పెరుగుతాయి. ఇంట్లో స్పైడర్ లు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. మీ జీవితంలో విజయం, ఆనందం కొరవడుతుంది.

వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఇవి ఉండటం అశుభంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లో సాలీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం పడకగదిలో సాలెపురుగులు గూడు కట్టుకొని ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ విభేదాలు వస్తాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

చాలా కాలంగా ఇంటి మూలంలో స్పైడర్ లు ఉంటే కుటుంబ సభ్యులకు డబ్బుకు సంబంధించిన సమస్యలు కొనసాగుతాయి. క్రమంగా డబ్బు కోల్పోవడం ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు ధన నష్టం సంభవిస్తుంది.

అనారోగ్య సమస్యలు

ఇంటికి పూజ గదిలో సాలె పురుగులు ఎప్పుడు కనిపించకూడదు. దైవం కొలువై ఉండే పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుని చిత్రపటాల పరిశుభ్రతపై ప్రత్యేకత శ్రద్ధ వహించాలి. ఆలయంలో సాలు పురుగులు కట్టుకుంటే అది ఇంటికి దురదృష్టానికి కారణం అవుతుందని నమ్ముతారు. పేదరికాన్ని తీసుకొస్తుంది.

వంట గదిలో సాలెపురుగులు ఎక్కువగా ఉంటే అది అశుభంగా పరిగణిస్తారు. దీని వల్ల కుటుంబ సభ్యులు ఎప్పుడో ఏదో ఒక రోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. వంట గదిలోనే గ్యాస్ సిలెండర్ పెట్టుకునే ప్రదేశం, సింక్ కింద ఎక్కువగా ఇవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

వాస్తు దోషాలు

ఇంట్లో సాలీడు వలన వాస్తు లోపాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కుటుంబ జీవితంలో తరచూ టెన్షన్ పడే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనడం కష్టమవుతుంది. జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉండకుండా పోతుంది. అందుకే ఇంటికి మూలల్లో ఎప్పుడు సాలెపురుగులు కనిపించిన వెంటనే వాటిని తొలగించండి. అవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి