భీమా చిత్రంలో భీమా, రామా అనే రెండు పాత్రలు చేశారు గోపీచంద్. భీమాగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రానికి ఏ.హర్ష దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేశ్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీరోల్స్ చేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవిబస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

భీమా చిత్రంపై రిలీజ్‍కు ముందు హీరో గోపీచంద్, దర్శకుడు హర్ష చాలా కన్ఫిడెంట్‍గా ఉన్నారు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్‍బస్టర్ అవుతుందనే ప్రమోషన్లలో గట్టిగా చెప్పారు. అయితే ఫలితం మరోలా వచ్చింది. గోపీచంద్ నటనపై ప్రశంసలు వచ్చినా.. ఓవరాల్‍గా సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రాణించలేకపోయింది. రూ.20 కోట్లలోపు గ్రాస్ వసూళ్లను సాధించింది.

భీమా మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు.

పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్‍ఐ భీమా (గోపీచంద్) కట్టడి చేస్తాడు. అయితే, పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది.. మళ్లీ తెరుచుకుందా అనేది కూడా ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా ఉంటుంది.

గోపీచంద్ తర్వాతి సినిమా

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ ప్రస్తుతం ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ స్టైక్ అంటూ గ్లింప్స్ వచ్చింది. తుపాకీతో ఓ పెళ్లి ఫంక్షన్‍లో గోపీచంద్ కాల్పులు జరిపే సీక్వెన్స్‌తో ఈ గ్లింప్స్ ఉంది. విశ్వం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‍పై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.