నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.04 2024

వారం: బుధవారం, తిథి : పాడ్యమి

నక్షత్రం : స్వాతి, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. భాగస్వామ్య చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టుపెట్టిన వస్తువులను విడిపిస్తారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, ప్రమోషన్‌ అర్డర్లు చేతికందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కూర, పండ్ల, కొబ్బరి, ధాన్య, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె వారికి కలసివచ్చే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి అందోళన కలిగిస్తుంది. పోస్టల్‌, టెలిగ్రాఫ్‌ రంగాలలో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. అర్థాంతరంగా నిలిపి వేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగాలేదు. ఉద్యోగస్తులకు రావలసిన క్లెయిమ్ లు మంజూరవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్‌, తినుబండారాలు, క్యాటరింగ్‌ పనివారలకు పురోభివృద్ధి. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రింటింగ్‌ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఏకాగ్రత లోపించడం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ప్రింటింగ్‌ రంగాల వారికి బకాయిల వసూళ్ళతో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పరించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మీ అంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయంగా చేస్తారు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. దుబారా ఖర్చులు అధికం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింక్‌ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000