Toyota Fortuner Leader edition price : ఇండియాలో టయోటో కిర్లోస్కర్​ మోటార్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది టయోటా ఫార్చ్యునర్​. బోల్డ్​నెస్​కి, స్టైలింగ్​కి పెట్టింది పేరుగా మారింది ఈ కారు. ఇక ఇప్పుడు.. ఫార్చ్యునర్​కు స్పెషల్​ ఎడిషన్​ను లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని పేరు టయోటా ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​. ఇందులో కొత్త స్టైలింగ్​ ఎలిమెంట్స్​తో పాటు అదనపు ఫీచర్స్​ ఉన్నాయి. ఈ మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​ విశేషాలను ఇక్కడ చూద్దాము..

టయోటా ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​ లాంచ్​..

టయోటా ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​లో కొత్త ఫ్రెంట్​- రేర్​ బంపర్​ స్పాయిలర్స్​, బ్లాక్​- వైట్​ రంగుల్లో డ్యూయెల్​ టోన్​ ఎక్స్​టీరియర్​ పెయింట్​ ఆప్షన్​, బ్లాక్​ అలాయ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి. స్పాయిలర్స్​ని ఆథరైజ్​డ్​ డీలర్స్​ ఫిట్​ చేస్తారు. ఇక ఇంటీరియర్​లో డ్యూయెల్​ టోన్​ సీట్లు, వయర్​లెస్​ ఛార్జర్​, టీపీఎంఎస్​ (టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​), ఆటో ఫోల్డింగ్​ మిర్రర్స్​ వంటి యాడెడ్​ అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ ఉన్నాయి.

ఫార్చ్యునర్​కు మరింత బోల్డ్​నెస్​ని, మరిన్ని ఫీచర్స్​ని యాడ్​ చేసేందుకే.. ఈ లీడర్​ ఎడిషన్​ని తీసుకొచ్చినట్టు టయోటో కర్లిస్కోర్​ మోటార్​ సేల్స్​ సర్వీస్​, యూజ్​డ్​ కార్​ బిజినెస్​ వైస్​ ప్రెసిడెంట్​ శబరి మనోహర్​ తెలిపారు.

Toyota Fortuner Leader edition : ఇక కొత్త ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​ ధర.. సాధారణ మోడల్స్​ కన్నా రూ. 80వేలు అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ధరపై ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొత్త టయోటా ఫార్చ్యునర్​ బుకింగ్స్​ మొదలయ్యాయి. డీలర్​షిప్​ షోరూమ్స్​కి వెళ్లి బుక్​ చేసుకోవచ్చు.

ఈ ఫార్చ్యునర్​ లీడర్​ ఎడిషన్​.. ఒక 4×2 వేరియంట్​. ఇందులో 2.8 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా ఆటోమెటిక్​ ట్రాన్స్​మీషన్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. ఆటోమెటిక్​ వేరియంట్​.. 201 బీహెచ్​పీ పవర్​ని, 500 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక మేన్యువల్​ వేరియంట్​.. 201 బీహెచ్​పీ పవర్​ని, 420 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Toyota Fortuner Leader edition features : 2009లో తొలిసారిగా లాంచ్​ అయినప్పటి నుంచి.. ఈ టయోటా ఫార్చ్యునర్​.. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​ని ఏలుతోంది. ఎఫ్​వై23-24లో సైతం.. 48శాతం వృద్ధిని నమోదు చేసింది టయోటా. 2.65 లక్షలు యూనిట్​ హోల్​సేల్స్​ ఉన్నాయి. దాని ముందు ఆర్థిక ఏడాదిలో అది 1.77లక్షలు మాత్రమే. ఫార్చ్యునర్​, ఇన్నోవా క్రిస్టా వల్లే ఇంతటి వృద్ధి సాధ్యమైందని సంస్థ చెబుతోంది.