సాధారణంగా పెన్షన్ అందుకోవాలంటే 60 ఏళ్ల తర్వాతనే. అయితే కొన్ని రకాల పెట్టుబడులు మీకు 40 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ వచ్చేలా చేస్తాయి. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ కూడా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల స్కీములను అందిస్తుంది. అందులో సరళ్ పెన్షన్ పథకం కూడా ఒకటి.

మీరు 40 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందే ప్లాన్. ఈ పథకం LIC ద్వారా అమలు అవుతుంది. LIC సరళ్ పెన్షన్ ప్లాన్ అనేది ఒక పెట్టుబడి పథకం. ఇది ఒకేసారి పెట్టుబడి ద్వారా నెలవారీ పెన్షన్‌ను అందజేస్తుంది. దీనిక సంబంధించిన వివరాలను కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. వయసు మీద పడిన తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేవారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ. ఎల్‌ఐసీ కింద వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. వయస్సు, ఆర్థిక స్థితి ప్రకారం LIC పాలసీలను ఎంచుకోవచ్చు. సరళ్ పెన్షన్ అనేది నిర్ణీత మొత్తానికి పాలసీని తీసుకుంటే జీవితాంతం స్థిర ఆదాయానికి హామీ ఇచ్చే పథకం అన్నమాట. ఇది స్టాక్ మార్కెట్‌తో లింక్ చేయని నాన్-లింక్డ్ ప్లాన్.

ఈ పాలసీలో చేరేందుకు కనీస వయోపరిమితి 40 ఏళ్లు. 80 ఏళ్ల వరకు ఈ పథకంలో సభ్యులుగా ఉండవచ్చు. సరళ్ పెన్షన్ ఆరు నెలల పాలసీ ప్రారంభించిన వినియోగదారులకు రుణ సేవను కూడా వాగ్దానం చేస్తుంది. సరళ్ పెన్షన్ యోజనలో సభ్యులు కావడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.

జీవిత పాలసీ యజమాని పేరులోనే ఉంటుంది. పాలసీ ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయరు అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాలసీదారు జీవితకాలం వరకు పెన్షన్ అందుబాటులో ఉంటుంది. అతని మరణం తర్వాత ప్రాథమిక ప్రీమియం మొత్తం నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.

జాయింట్ ఖాతా జంటలు, ఇతరులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం అతను/ఆమె పెన్షన్ పొందుతారు. పాలసీదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఇప్పుడు ఇద్దరూ చనిపోతే నామినీకి పెట్టుబడి మొత్తం వస్తుంది.

LIC సరళ్ పెన్షన్ ప్లాన్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే మీకు కావలసిన మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడిని బట్టి పింఛను అందజేస్తారు. పెట్టుబడిదారులు వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన ఏ పద్ధతిలోనైనా పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు.

రూ. 10 లక్షల ఒకే ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పొందుతారు.

రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.12,388 పింఛనుగా వస్తుంది. ఇది కాకుండా, మీకు డిపాజిట్‌లో సగం తిరిగి కావాలని మీరు భావిస్తే, మీరు దానిని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ స్కీమ్ భార్యాభర్తలకైతే బాగుంటుంది. దీని ప్రకారం మీరు పెన్షన్ పొందుతారు. ఒకవేళ మరణిస్తే మీ భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత నామినీకి పెట్టుబడి మెుత్తం వెళ్తుంది. తక్కువ వయసులో పెన్షన్ పొందాలి అనుకునేవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి.

సరళ్ పెన్షన్ యోజన పథకంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు LIC అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పాలసీని తీసుకోవచ్చు. పాలసీకి సబ్‌స్క్రైబ్ చేసే ముందు మొత్తం నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. మేం ఈ కథనం మీ సమచారం కోసం మాత్రమే ఇచ్చాం.