Vijayendra Prasad About Ruslaan Movie: బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.