తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే లైట్ బీర్, వైన్ వంటివి ఎంచుకొని తాగడం మంచిది. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో కొంత హాని చేసినా… పూర్తి మద్యం తాగే కన్నా వీటిని కలిపి తాగడం ఆరోగ్యానికి కొంత నయం. ఆల్కహాల్ తాగేటప్పుడు పుష్కలంగా నీరును తాగండి. దీనివల్ల శరీరం నిర్జలీకరణానికి గురి కాకుండా ఉంటుంది. శరీరం నుండి టాక్సిన్లు కూడా బయటకి పోతాయి. కాలేయంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆల్కహాల్ తాగిన రోజు నా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయామం చేయండి. బరువు పెరగకుండా చూసుకోండి. ఇలా అయితే కాలేయంపై తక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.