World Liver Day 2024: ఆల్కహాల్ వినియోగం కాలేయ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే… ఆల్కహాల్ మాత్రమే కాదు, అధిక చక్కెర, అధిక నూనె వాడకం కూడా కాలేయ ఆరోగ్యాన్ని మందగించేలా చేస్తాయి. అధిక చక్కెర, అధిక నూనె వాడకం కేవలం కాలేయ ఆరోగ్యాన్నే కాదు, శరీర ఆరోగ్యాన్ని మొత్తం కుంగదీస్తాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కాలేయ పనితీరు దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.