1. జేఆర్ఎఫ్ తో పీహెచ్ డీ లో ప్రవేశానికి అర్హత, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం.
  2. జేఆర్ఎఫ్ లేకుండా పీహెచ్ డీ లో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం.
  3. పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి మాత్రమే అర్హత. వీరికి జేఆర్ఎఫ్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం కానీ లభించదు.

ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజీ

2, 3 కేటగిరీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తామని యూజీసీ తెలిపింది. నెట్ మార్కుల కంబైన్డ్ మెరిట్, ఇంటర్వ్యూ/వైవా వోసీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కేటగిరీ 2, 3లో అభ్యర్థులు నెట్ లో సాధించిన మార్కులు పీహెచ్ డీలో ప్రవేశానికి ఏడాది పాటు చెల్లుబాటు అవుతాయి.