ప్రతిరోజూ తినాల్సిన కూరగాయల్లో టమోటో ఒకటి. టమోటా ప్రతిరోజూ తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా పురుషులు టమోటాలను తినడం వల్ల వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఏ పురుషులైతే వారానికి కనీసం కిలోన్నర టమోటో తింటారో వారికి ప్రొస్టేట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. అలాగే పిల్లలు, పెద్దలు అంతా టమోటాలు తినడం వల్ల వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇక టమోటోకి ఆ రంగుని ఇచ్చేది లైకోపీన్. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. మన శరీరానికి ఈ లైకోపీన్ చాలా అవసరం. హైబీపీని తగ్గించే లక్షణం కూడా టమోటోకి ఉంది. హై బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడేవారు ప్రతిరోజు టమోటాలను తినాలి. ప్రతిరోజూ అర గ్లాసు టమోటో రసాన్ని తాగినా కూడా… ఎంతో మేలు జరుగుతుంది. టమోటో రైస్, టమోటో పచ్చడి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పిన టమోటా పులిహార కూడా రుచి అదిరిపోతుంది. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గానే కాదు, వారి లంచ్ బాక్స్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసి పిల్లలకు తినిపించండి. వారికి నచ్చడం ఖాయం. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చిని అధికంగా వేసుకోవాలి. పిల్లలకైతే ఒక పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది.