ప్రతి మనిషికి కోపం ఉంటుంది. అది సహజ ఉద్వేగం… అలా అని వదిలేస్తే వీలు కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే సహనం, ఓపిక కావాలి. అలాగే కోపం వచ్చినప్పుడు ఆ ఓపిక, సహనంతోనే నోరు జారకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కోపం పై అదుపు సాధిస్తే జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఎవరితోనూ మీకు విరోధం ఏర్పడదు. ప్రశాంతంగా జీవించే అదృష్టం మీకు దక్కుతుంది.