వారిది ఏ కోటా…?

“గెలిచిన ప్రతిసారి మగాడివి, ఓడితే కాదు అంటావా ..? కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా..? మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చెయ్, ఇచ్చిన 420 హమీలు అమలు చెయ్.. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా… ఇవేం మాటలు ? రేవంత్ కు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొడంగల్, జీహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాల్ విసరి పారిపోయిండు. ఆయన మాటకు విలువ ఏం ఉంది ? రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చెయ్.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియాంక గాంధీలది ఏం కోటా ..? రేవంత్ ది పేమేంట్ కోటా.. మాణిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా. పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ డీల్లీకి పేమేంట్ చేయాలి. బిల్డర్లను బెదిరించాలి. వ్యాపారులను బెదిరించాలి. ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు. ఆయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఆయననే సీఎం అన్న నమ్మకం లేదా..? అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.