మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చారు. కారులో డెహ్రాడూన్‌లోని విమానాశ్రయానికి వెళ్తుండగా దారిలో సచిన్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన బైకుపై వెళ్తున్న హరీష్ అనే వ్యక్తిని చూశాడు. టెండూల్కర్ ఐ మిస్ యూ అని జెర్సీపై రాసి ఉంది. అలాంటి పరిస్థితిలో సచిన్ తన అభిమానిని చూసి డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఆ వ్యక్తి పక్కనే కారు ఆపి ఎయిర్‌పోర్ట్‌కి ఎలా వెళ్లాలని అడిగాడు. ఆ తర్వాత సచిన్‌ని చూసి ఆ వ్యక్తి ఓ క్షణం నమ్మలేకపోయాడు. నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్యర్యపోయాడు. ఆ తర్వాత చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్‌ను తాను ఇంతకు ముందు కలిశానంటూ గుర్తు చేశాడు. అది విన్న సచిన్ కూడా ఆశ్యర్యపోయాడు. ఈ అభిమాని ప్రేమకు సచిన్ సంతోషించాడు.