spot_img
HomeEntertainmentశ్రీనివాస మంగాపురం రిజల్ట్ పై మాట్లాడిన జై కృష్ణ.. మీరు ఫ్రీగా ఉన్నారా!

శ్రీనివాస మంగాపురం రిజల్ట్ పై మాట్లాడిన జై కృష్ణ.. మీరు ఫ్రీగా ఉన్నారా!

spot_img
spot_img


శ్రీనివాస మంగాపురం రిజల్ట్ పై మాట్లాడిన జై కృష్ణ.. మీరు ఫ్రీగా ఉన్నారా!

Aug 1, 2026 7:18PM

 

ఘట్టమనేని జై కృష్ణ(Jai krishna)ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)తో సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా ఎలాంటి బెరుకు లేకుండా నటించి ఘట్టమనేని అనే బ్రాండ్ కి తెలుగు చిత్ర సీమ సాహో అనాల్సిందే అని చాటి చెప్పాడు. అభిమానులు, ప్రేక్షకులతో పాటు రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. దీంతో  జై కృష్ణ తన ఆనందం వ్యక్తం చేస్తూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసాడు.

 జై కృష్ణ మాట్లాడుతు నాకు మంచి వెల్కమ్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కి, మొదటి నుంచీ తమకి అండగా ఉన్న ఘట్టమనేని అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమా చూసినవారు నన్ను అభినందించడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా  యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో పెర్ఫామెన్స్ ని అంతా మెచ్చుకుంటున్నారు అని చెప్పడంతో పాటు  ఈ వారాంతంలో మీకు ఫ్రీ టైం ఉంటే చూడాల్సిందిగా కోరాడు.

Also read: సీతమ్మతల్లి సాయిపల్లవి పై ట్రోల్స్.. ఇది వాళ్ళ పనే 

దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా పి కిరణ్,  వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు కాగా జై కృష్ణ సరసన మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు  రష తడాని జత కట్టింది. 

jai krishna, srinivasa mangapuram, Rasha Thadani, Bollywood



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments