spot_img
HomeNewsడీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!

spot_img
spot_img

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!

ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్త కరంగా మారింది. జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే వ్యవహారం పైన విపక్షాలు రభస కొనసాగిస్తున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లు – డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్దం చేసింది. మారుతున్న సమీకరణాల వేళ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇదే ఇప్పుడు వారి ఆశలను గల్లంతు చేస్తోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశ పెట్టి.. ఆమోదించేలా వ్యూహాలు సిద్దం చేసింది. శివసేన (థాకరే), టీఎంసీ, ఆప్ నుంచి చీలిక వర్గం ఎంపీ ల మద్దతుతో బిల్లును ఆమోదించేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇండి కూటమి కీలక నేత శరద్‌పవార్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్‌డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి. అయితే, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి. కాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ 'బంగారం' లాంటి నిర్ణయం..!!
శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ ‘బంగారం’ లాంటి నిర్ణయం..!!

delimitation-bill-2026-missing-from-monsoon-session-agenda-sparks-fresh-speculation-details-here

మారుతున్న అంచనాలు

ప్రస్తుత సమావేశాల్లో ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జి, పెల్లెట్ల ప్రయోగం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో.. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కష్టమని, ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇదే సమయంలో వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌, ఎఫ్‌సీఆర్‌ఐ బిల్లులను కూడా ప్రభుత్వం వాయిదా వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. దీంతో.. అసలు 2029 నాటికి డీలిమిటేషన్ పూర్తవుతుందా లేదా అనే చర్చ మొదలైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments