HomeEntertainmentయశ్ 'టాక్సిక్' ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆరోజు సోషల్ మీడియా షేక్..!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆరోజు సోషల్ మీడియా షేక్..!

spot_img


యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆరోజు సోషల్ మీడియా షేక్..!

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఆగస్టు 26 న ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబవుతోంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 8 న అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఈ మూవీని మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్ లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ లాంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ స్వరాలను సమకూరుస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ఈ సినిమా వివిధ భాషల్లో అలాగే పలు దేశాల్లో సైతం గ్రాండ్​ గా రిలీజ్​ కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్ జేజే పెర్రీ వర్క్ చేయడం విశేషం.

టాక్సిక్ మూవీ స్టోరీ విషయానికి వస్తే తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ సాగే హై ఓల్టేజ్ యాక్షన్​ థ్రిల్లర్ గా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రం నుంచి టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ఇన్ని రిలీజ్ అయినా స్టోరీ లైన్ ఏంటనేది ఎవరూ కనిపెట్టలేకపోవడం విశేషం. ఇది డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంటెలిజెన్స్ కు నిదర్శనంగా నిలుస్తుంది. టాక్సిక్ మూవీపై ఇటీవలె యశ్ మాట్లాడుతూ ఈ సినిమా ఒక వైల్డ్ అండ్ బోల్డ్ యాక్షన్ రైడ్‌ లా ఉంటుందని తెలిపారు. ఒక మంచి యాక్షన్ సినిమా చూడాలి అనుకునేవారికి ఈ మూవీ ఒక సరికొత్త ఫీలింగ్ ఇస్తుందన్నారు.

yash Toxic movie trailer is arriving on August 8 Social media is set to be shaken up that day

మరోవైపు నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణ్ చిత్రంలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో యశ్ రావణుడి పాత్రలో మెప్పించారు. ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రామాయణ్ మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments