- రోహిత్ రెడ్డి ఓడిపోగానే కాంగ్రెస్ లోకి చేరిన చరిత్ర సంతోష్ గౌడ్‌ది
- అధికారం కోసం పార్టీలు మారింది ఎవరో తాండూరు ప్రజలకు తెలుసు
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండపతి శివకుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు: బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్‌కు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి ని విమర్శించే స్థాయి లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడపతి శివకుమార్ స్పష్టం చేశారు. మాజీ మార్కెట్ చైర్మన్ బాల్రెడ్డి పై టిఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బాల్ రెడ్డి ఎక్కడున్నా విజయమేనని, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం సంతోష్ గౌడ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి ఓడిపోగానే ఉనికి కోసం, అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లోకి రావడానికి సంతోష్ గౌడ్ ఎక్కడెక్కడ తిరిగారో తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. బాల్ రెడ్డి మీలాగా మున్సిపల్ ఆస్తులను ఆశించి స్వార్థ రాజకీయాలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజల్లో బాల్ రెడ్డి కి పెరుగుతున్న క్రేజ్ చూసి తట్టుకోలేకే సంతోష్ గౌడ్ మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం పాకులాడే బీఆర్ఎస్ నేతలకు తాండూరు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శివకుమార్ హెచ్చరించారు.