అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ లో సగభాగం వారికేనట..!
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్నారు. ఆయన వరుసగా చేసిన 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. టాలీవుడ్ రాజమౌళి, సుకుమార్ లాంటి తక్కువమంది దర్శకులకు మాత్రమే ఈ ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో వారి సరసన చేరారు. 2015 లో పటాస్ తో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వర ప్రసాద్ గారు తదితర సినిమాలతో వరుసగా హిట్స్ సాధించారు.
ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వర ప్రసాద్ గారులో గెస్ట్ రోల్ తర్వాత అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వస్తున్న ఐదో చిత్రం కావడం విశేషం.
అలాగే నందమూరి కల్యాణ్ రామ్ తో అనిల్ చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ కు చెందిన సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే అనిల్ రావిపూడికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి తన రెమ్యూనరేషన్ లో దాదాపు సగభాగం తన డైరెక్షన్ టీమ్ లోని రైటర్స్ కే వెళ్తుందట. అనిల్ డైరెక్షన్ టీమ్ లో చాలామంది రైటర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన తక్కువ సమయంలోనే సినిమాలు చేస్తుంటారని టాక్. ఏదేమైనా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

