- బాలరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు
- అవినీతి మచ్చ లేని నాయకుడు బాల్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకులు కే. రావి
జనవాహిని ప్రతినిధి తాండూరు: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్ చేసిన విమర్శలను తాండూరు 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె. రావి తీవ్రంగా ఖండించారు. బాల్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి సంతోష్ గౌడ్‌కు లేదన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతోష్ గౌడ్ నివసిస్తున్న ఇల్లు ప్రభుత్వ, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి కట్టింది కాదా అని ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి కాదని నిరూపించే ధైర్యం ఉంటే మున్సిపల్ ఆఫీసులో ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్న బాల్ రెడ్డిపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. 2018లో కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన సంతోష్ గౌడ్, మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఉదంతాన్ని తాండూరు ప్రజలంతా చూశారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రంగులు మార్చే అలవాటు తమకు లేదని, ఇకపై బాల్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తే తాండూరు ప్రజల సాక్షిగా తగిన బుద్ధి చెబుతామని కె. రావి హెచ్చరించారు.