HomeTelanaganahyderabadవానల కోసం ‘జలాభిషేకం’...!

వానల కోసం ‘జలాభిషేకం’…!

  • ది గ్రేన్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జలాభిషేకాలు
  • వర్షాలు సమృద్ధిగా కురవాలని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
  •  రైతులు, వ్యాపారస్తులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని స్థానిక ‘ది గ్రేన్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా.. పట్టణంలోని ఐదు ప్రముఖ శివాలయాల్లో స్వామివారికి భక్తిశ్రద్ధలతో జలాభిషేక పూజలు జరిపారు.తాండూరులోని శ్రీ కోటేశ్వర దేవాలయం, పాత తాండూరులోని శ్రీ భద్రేశ్వర దేవాలయం, శ్రీ నగరేశ్వర దేవాలయం, శ్రీ అంతప్పబావి శివాలయం, మరియు శ్రీ చెరువెంట ఈశ్వర శివాలయాల్లో ఈ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. కరువు పరిస్థితులు వీడి ప్రకృతి కరుణించాలని కోరారు. సకాలంలో వర్షాలు పడి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ పూజలు చేపట్టినట్లు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండితేనే అటు రైతులకు, ఇటు వ్యాపార వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో, లాభాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ది గ్రేన్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటకం వీరేందర్, కార్యదర్శి దరిమిది ప్రభు, కోశాధికారి భోజిరెడ్డి పటేల్, మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, మల్లెపల్లి వెంకటేశం, కల్వ రాధాకృష్ణ, సల్ల దామోదర్, బంటారం సుధాకర్, వెంకట్ రాములు గౌడ్, పటేల్ రాంరెడ్డి పాల్గొన్నారు.అలాగే అసోసియేషన్ సభ్యులు బానకారి కృష్ణ, నాగారం జగదీశ్వర్, మంకాల రవీందర్, మోముల మాణిక్యం, రాజేష్ సోనీ, నార జయపాల్ రెడ్డి, బాలేశ్వర్ గుప్తా, మల్లెపల్లి మధుసూదన్, బి. శ్రీధర్, శంబుని నర్సింలు, చాంకూరి విశ్వనాథ్ తదితర వర్తక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments